Telangana is largest power consumer
తెలంగాణ విద్యుత్ వినియోగంలో టాప్ ప్లేస్ లో నిలిచింది . ఇక విద్యుత్ శాఖ అరుదైన రికార్డు సృష్టించింది. విద్యుత్ వినియోగంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ లేనంతగా విద్యుత్ డిమాండ్‌తో సరికొత్త రికార్డు సృష్టించింది. ఒక్కరోజే 13,168 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ చేరుకున్నట్టు ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ తెలిపారు.. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఈ రోజు విద్యుత్ అధిక డిమాండ్‌కు చేరుకుందన్న ఆయన.. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా తలసరి విద్యుత్ వినియోగం పెరిగిందన్నారు. పంటసాగు, ఎత్తిపోతల పథకాల్లో విద్యుత్ వినియోగం పెరిగినట్టు వెల్లడించారు. అయితే, విద్యుత్ డిమాండ్ ఇంకా పెరిగినా ఇబ్బందిలేదని స్పష్టం చేశారు ప్రభాకర్… విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం రెండోస్థానంలో ఉందని వెల్లడించిన ఆయన.. మొదటిస్థానంలో తమిళనాడు ఉండగా.. మూడో స్థానంలో కర్ణాటక రాష్ట్రం ఉందని తెలిపారు. ఇక, హైదరాబాద్ మెట్రో రైలు కోసం 150 మెగావాట్ల విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు ప్రభాకర్.