Telangana Land Registration Fees Hiked
కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన 38వ జీఎస్టీ సమావేశంలో భూముల రిజిస్ట్రేషన్ ధరలను పెంచాలని నిర్ణయించింది. దీంతో తెలంగాణ స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ భూముల రిజిస్ట్రేషన్ ధరల పెంపుకు ఇప్పటికే కసరత్తు చేస్తోంది . వారం రోజుల్లోనే భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థికమాంద్యం ప్రభావంతో పన్నుల రాబడి భారీగా తగ్గి, తెలంగాణ రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతుంది. ఇప్పటికే మౌఖికంగా వివిధ అభివృద్ధి పనులను ఎక్కడివక్కడే నిలిపివేయాలని చెప్పిన తెలంగాణ సర్కార్, ఇప్పుడు తాజాగా తెలంగాణ ఖజానాకు ఆదాయం సమకూరే మార్గాలపై దృష్టిసారించింది. నూతన సంవత్సరం వస్తున్న వేళ మద్యం ధరలను పెంచి ఎక్సైజ్ ఆదాయం పెంచాలని నిర్ణయం తీసుకున్న సర్కార్ అమలు కూడా మొదలు పెట్టింది.
ఇక తాజాగా భూముల రిజిస్ట్రేషన్ విలువలను పెంచేందుకు రెడీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భూముల ధరలు భారీగా పెరగాయి. ఐదారు రెట్లుభూముల ధరలకు రెక్కలొచ్చాయి హైదరాబాద్ లో అయితే చుక్కలనంటున్నాయి. కానీ దానికి సరిపడా రిజిస్ట్రేషన్ విలువలు మాత్రం లేదు. దీంతో తెలంగాణ సర్కారుకు ఆదాయం పెద్దగా సమకూరటం లేదని భావిస్తున్న నేపధ్యంలో భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెంచాలని సర్కార్ భావిస్తుంది. దాదాపు 7 ఏళ్ల క్రితం నాటి రిజిస్ట్రేషన్ ధరలతో ఇప్పుడు భూముల పెరిగిన ధరలకు చెల్లింపులు చేస్తుంటే ప్రభుత్వానికి భారీగా గండిపడుతుంది. అందుకే భూ రిజిస్ట్రేషన్ విలువలను పెంచేందుకు కేసీఆర్ సర్కారు సన్నద్ధం అయ్యింది.