నామినేషన్ల విత్‌డ్రా గడువు ముగిసింది …

120
Telangana Municipal Election
Telangana Municipal Election

Telangana Municipal Election Nominations Withdrawal

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల విత్‌డ్రాకు  గడువు ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా చివరి నిమిషం వరకు ఎవరు బరిలో ఉంటారా అన్న ఉత్కంఠ నెలకొంది. భారీగా బేరసారాలు కొనసాగాయి. ఇంకా కొంత మంది రెబల్‌ అభ్యర్థులు బరిలో మిగిలారు. చివరి నిమిషం వరకు విత్‌డ్రా చేయించడానికి అన్ని పార్టీల ముఖ్యనేతలు రంగంలోకి దిగారు. ఈ ఎన్నికలను రాజకీయ పార్టీలన్నీ ఒకింత సీరియస్ గానే తీసుకుంటున్నాయి. అందులోను అధికార పార్టీ మరీనూ. సమీక్షల మీద సమీక్షలు నాయకులను పిలిచి మాట్లాడుతుంది పార్టీ నాయకత్వం. మరి మీరెందుకు మాట్లాడం లేదు ? వదిలేశారా అంటూ కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీ నాయకత్వం మీద కస్పు బుస్సు మంటున్నారు.

కాంగ్రెస్ లో కస్సు బుస్సులు కామనైపోయింది. పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఇక్కడ పంచాయితీలు అనేవి కామన్. మున్పిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ ఎలాగైనా పైచేయి సాధించే పనిలో పడింది. ఎప్పటికప్పుడు సమీక్షలు చేయటం అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నాలు చేసింది. సీఎం కేసీఆర్ ఫుల్ కాన్పిడెన్స్ తో ఉన్నా కేటీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నారు. నాయకులతో నేరుగా మాట్లాడుతూ నచ్చ జెప్పే పని చేస్తున్నారు. ఐతే ఇది మన పార్టీలో కనిపించటం లేదేంటి అని కాంగ్రెస్ నాయకులు పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మున్పిపల్ ఎన్నికల్లో చాలా చోట్ల ఆశించిన వారికి టికెట్లు రాలేదని ? ఓ వర్గం నాయకులు ఇంకో వర్గం వారికి బీ ఫామ్ ఇవ్వటం లేదనే ఫిర్యాదులు కూడా వచ్చాయి. జిల్లాలకు ఇంచ్జార్జీలుగా వేసిన వారితో కొన్ని సమస్యలువచ్చాయి. వీటిని పరిష్కరించాల్సిందిన నాయకత్వం పెద్దగా పట్టించుకోవటం లేదని ఇది పార్టీకి నష్టం వాటిల్లుతుందంటున్నారు సీనియర్లు. పీసీసీ చీఫ్ జిల్లాకే పరిమితం కాకుండా అందరితో సమీక్షలు పెట్టండి అని డిమాండ్ చేస్తున్నారు.

Telangana Municipal Election Nominations Withdrawal,municipal elections , nominations , with draw , rebal candidates, trs party, congress

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here