టాప్ గేర్‌లో టీఆర్ఎస్

Telangana Municipal Election Results LIVE

తెలంగాణ‌లో మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో తెరాసా పార్టీ స‌త్తా చాటుతుంది. ఈనెల 22న రాష్ట్రవ్యాప్తంగా 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు ఎన్నిక‌లు జ‌రిగాయి. అయితే నేడు రిజ‌ల్ట్స్ రానున్నాయి. ఇప్ప‌టికే కౌంటింగ్ మొద‌లైంది.రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2619 కౌంటింగ్‌ కేంద్రాలలో ఈ ప్ర‌క్రియ జ‌ర‌గ‌నుంది. అయితే ఈ ఎన్నిక‌ల్లో అధికార‌పార్టీ స‌త్తా చాటుతుంది. ఇప్ప‌టికే కొన్ని ఏరియాల‌లో గెలుపోట‌ములు లెక్క‌తేల్చాయి. మెజారిటీ మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లలో కారు తిరుగులేనిరీతిలో సత్తా చాటింది.. అదేవిధంగా కొడంగల్‌లో ఎంపీ రేవంత్‌రెడ్డికి షాక్‌ తగిలింది. కొడంగల్‌ మున్సిపాలిటీలో కేవలం మూడు వార్డుల్లో మాత్రమే బీజేపీ గెలుపొందింది. మ‌రోవైపు మంత్రి కేటీఆర్ ఇలాకాలో స్వతంత్ర అభ్యర్థులు సత్తా చాటారు. మొత్తం పది స్థానాల్లో స్వతంత్రులు గెలవడంతో అధికార టీఆర్ఎస్ అభ్యర్థులు షాక్‌ తిన్నారు. వీరిలో ఎక్కువమంది టీఆర్‌ఎస్‌ రెబెల్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది. రెబెల్స్‌ గెలుపొందినా వారిని తిరిగి టీఆర్‌ఎస్‌లోకి తీసుకునేది లేదని కేటీఆర్‌ ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. మ‌రోవైపు బొడ్డుప్పల్‌ మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ మేయర్‌ అభ్యర్థి సంజీవరెడ్డి ఓటమి పాల‌య్యారు. కాంగ్రెస్ గెలిచిన వాటిలో యాదగిరి గుట్ట, నారాయణ్ ఖేడ్, వడ్డేపల్లి తదితర చోట్ల కాంగ్రెస్ గెలిచింది. భైంసాలో టీఆర్ఎస్, కాంగ్రెస్ ఆచూకీ కనిపించలేదు. ఇక్కడ ఎంఐఎం-బీజేపీ మధ్య హోరాహోరీ పరిస్థితి ఉంది.ఇప్పటివరకూ 76 మున్సిపాలిటీలో టీఆర్ఎస్ విజయం సాధించినట్లుగా తెలుస్తోంది.

Telangana Municipal Election Results LIVE,#Counting of votes,#TRS,#Congress,#BJP,#AIMIM,TRS bags most of the seats,ktr,revanth reddy,results live updates,trs rebels

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article