పురపాలక చట్టం గురించి కేటీఆర్ ఏం చెప్పాడంటే?

Telangana New Municipal Act 2019

పురపాలనలో పౌరుడే పాలకుడని, ఇదే నూతన పురపాలక చట్ట స్పూర్తి అని మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు తెలిపారు. రెండు రోజుల పాటు నూతన పురపాలక చట్టంపైన ఆ శాఖ, మున్సిపల్ కమీషనర్లతో రెండు రోజుల పాటు నిర్వహించిన సదస్సు ముగింపు కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. పాత చట్టంతో పొల్చితే నూతన చట్టంలో వచ్చిన సంస్కరణలు, మార్పులు, నిబంధనలపైన ఈ రెండు రోజులపాటు పురపాలక శాఖ నిపుణులతో టౌన్ ప్లానింగ్, రాబడులు, పాలన సంస్కరణల వంటి అంశాలపైన ఈ సదస్సులో చర్చించారు. సదస్సు ముగింపు సమావేశానికి హాజరైన మంత్రి కేటీఆర్ కమీషనర్లకు పురపాలనలో ప్రభుత్వం విజన్ పైన దిశానిర్ధేశం చేశారు. ప్రజలకు పౌరసేవలను పారదర్శకంగా, అవినీతికి తావులేకుండా వేగంగా అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం నూతన చట్టాన్ని రూపొందించిందని కేటీఆర్ తెలిపారు.

ప్రజలకోసం, పౌర సేవల కోసం, పాలనా సౌలభ్యం కోసం నూతన చట్టం పనిచేస్తుందని తెలిపారు. వ్యక్తి కేంద్రీకృతంగా ఉన్న పాత చట్టం స్ధానంలో వ్యవస్ధ కేంద్రీకృతంగా నూతన పురపాలక చట్టం తీసుకువచ్చామన్నారు. ప్రజలతో మమేకమై తన రాజకీయ జీవితాన్ని సాగిస్తున్న ముఖ్యమంత్రి కెసియార్ గారు ప్రజలకు అవసరం అయిన పలు సంస్కరణలను ఈ చట్టం ద్వారా తీసుకువచ్చారు. 75 గజాలలోపు ఇంటి నిర్మాణానికి అనుమతులు అవసరం లేకుండా చేయడం, భవన నిర్మాణాల కోసం సెల్ప్ సర్టిఫికేషన్ వంటి నూతన నిబంధనలు ఇలాంటి స్పూర్తిలోంచి వచ్చినవే అని తెలిపారు. అందరం కలిసి నూతన పురపాలక చట్టం స్పూర్తిని కొనసాగిస్తూ దాన్ని అమలు చేద్దాం అన్నారు.

కలిసి పనిచేద్దామన్న మంత్రి
పరిపాలనా ఫలాలు, సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను మరింతా మెరుగ్గా ప్రజలకు అందించేందుకు మున్సిపల్ కమీషనర్లు పనిచేయాలని మంత్రి కోరారు. ప్రణాళిక పట్టణాభివృద్దికి ప్రతి ఒక్కరం కలిసి పనిచేద్దామని మంత్రి పురపాలక శాఖాధికారులకు పిలుపునిచ్చారు. ప్రజలు కోరుకుంటున్న పారిశుద్యం, గుడ్ గవర్నెన్సు, వేగవంతమైన, పారదర్శకమైన పాలనను అందించేందుకు కలిసి ముందుకు సాగుదామన్నారు. పురపాలనా ఫలాలు ప్రజలకు చేరాలంటే ఒక్కరితోనే సాద్యం కాదని, ఒక టీంగా ముందుకుపోదామన్నారు. వారం రోజుల్లో మున్సిపల్ కమీషనర్లు తమ సిబ్బందితోనూ నూతన మున్సిపల్ చట్టంపైన ఒక సమావేశాన్ని ఎర్పాటు చేసుకోవాలని సూచించారు.  తాము పనిచేస్తున్న పట్టణంలో మార్పు వచ్చేలా పత్రి ఒక్క మున్సిపల్ కమీషనర్ పనిచేయాలని కోరారు. పురపాలనలో విస్తృతమైన అనుభవం ఉన్న కమీషనర్లు… చట్టంలో లేని వినూత్నమైన పద్దతుల్లో పనిచేసి పట్టణాలకు మరింత శోభ తీసుకువస్తామంటే తాను మద్దతు ఇస్తానని కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే రాష్ర్టంలో సిద్దిపేట, సిరిసిల్లా, వరంగల్, సూర్యాపేట, పీర్జాదీగూడా వంటి మున్సిపాలీటీలు వివిధ అంశాల్లో జాతీయస్ధాయిలో గుర్తింపు పొందేలా పని చేస్తున్నాయని, వాటిని పరిశీలించాలని మంత్రి కమీషనర్లను కోరారు. దీంతో పాటు జాతీయస్ధాయిలో పురపాలనలో విన్నూతమైన, అదర్శవంతమైన పద్దతులను అనుసరిస్తున్న పట్టణాలను అధ్యయనం చేసేందుకు వేళ్తామంటే పంపుతామని తెలిపారు. పురపాలనలో టెక్నాలజీ వినియోగం ద్వారా పాదర్శకత మరింత పెరుగుతుందన్న మంత్రి, సామాజిక మాద్యమాలను సైతం వినియోగించుకుంటూ ప్రజల భాగసామ్యాన్ని పెంచాలన్నారు.

telangana municipal updates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *