కృష్ణానది బోర్డు సమావేశంలో తెలంగాణా అభ్యంతరం

145
Telangana officials objected to Krishna Nadi board meeting
Telangana officials objected to Krishna Nadi board meeting

Telangana officials objected to Krishna Nadi board meeting

కృష్ణానది బోర్డు సమావేశంలో తెలంగాణ అధికారులు ఏపీకి చెందిన ఇరిగేషన్‌ సలహాదారు వెంకటేశ్వరరావు హాజరు కావటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కృష్ణానది యాజమాన్య బోర్డు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు జలసౌధలో సమావేశమైంది. ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. నీటి వాటా, టేలిమెట్రి, బోర్డుకు నిధుల కేటాయింపుపై సమావేశంలో చర్చించారు. ఇప్పటి వరకు వాడుకున్న నీటి లెక్కలతో రావాలని అధికారులకు కృష్ణా నది యాజమాన్య బోర్డు సూచించిన విషయం తెలిసిందే.
ఇక ఈ సమావేశానికి ఏపీ ఇరిగేషన్‌ సలహాదారు వెంకటేశ్వరరావు  రావటాన్ని తెలంగాణా  అధికారులు అభ్యంతరం తెలిపారు. గతంలో తెలంగాణ తరపున దివంగత ఇంజనీర్‌ విద్యాసాగర్‌ హాజరైతే ఏపీ అధికారులు అభ్యంతరం తెలిపారని ఆ విషయాన్ని గుర్తు చేశారు. అప్పుడు విద్యాసాగర్ హాజరయితే  బోర్డు నుంచి తప్పించారని తెలంగాణ అధికారులు పేర్కొన్నారు . ఇప్పుడు ఏపీకి చెందిన సలహాదారు ఎలా హాజరవుతారని అధికారులు ప్రశ్నించారు.

Telangana officials objected to Krishna Nadi board meeting,krishna board meeting, water problems, telugu states, jala soudha , irrigation advisor, venkateshwar raao

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here