పంచాయితీ పోరుకు నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ రాష్ట్రంలో మూడు విడతలుగా గ్రామ పంచాయితీ ఎన్నికలను నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి ప్రకటించారు. జనవరి 21 తేదీన మొదటి విడత ఎన్నికలను, 25వ తేదీన రెండో విడతను ఈ నెల 30వ తేదీన మూడో విడత ఎన్నికలు నిర్వహించనున్నట్టు నాగిరెడ్డి ప్రకటించారు. మొదటి విడతలో 4480 గ్రామపంచాయితీకు ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండో దశలో 4137 గ్రామ పంచాయితీల్లో పోలింగ్ నిర్వహిస్తారు. మిగిలిన 4115 గ్రామ పంచాయితీలకు మూడో విడతలో ఎన్నికలను నిర్వహించనున్నారు. ఎన్నికలు అయిన వెంటనే కౌంటింగ్ నిర్వహించనున్నట్టు నాగిరెడ్డి ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,13,190 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్లను లెక్కించనున్నారు.ఈ ఎన్నికలను బ్యాలెట్ పద్దతిలో నిర్వహించనున్నట్టు నాగిరెడ్డి ప్రకటించారు. ఇప్పటికే మూడు కోట్లకు పైగ బ్యాలెట్ పత్రాలను సిద్దం చేసినట్టు తెలిపారు. ఎన్నికల కోడ్ ఇవాళ్టి నుండి అమల్లోకి వస్తోందని నాగిరెడ్డి చెప్పారు. ఈ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లలో నోటా గుర్తును కూడ ఉంటుందని నాగిరెడ్డి తెలిపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article