తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పోటీపై చంద్రబాబు

Telangana Parliament Election, Chandrababu Sensational Decision

రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం విషయంలో టిడిపి అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఒకపక్క దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న చంద్రబాబు తెలుగు ప్రజలు ఉన్న ఇతర రాష్ట్రాల్లో సైతం పోటీచేస్తానని ప్రకటించారు. అలాంటి సందర్భంలో ముందస్తు ఎన్నికల్లో తెలంగాణలో టిడిపికి ఎదురైన ఘోర పరాజయం నేపథ్యంలో తెలంగాణలో చంద్రబాబు నాయుడు పార్లమెంట్ ఎన్నికల బరిలో ఉంటారా లేదా అన్న ప్రశ్న మొదలైంది. అయితే ఈ నేపథ్యంలోనే చంద్రబాబు తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

జాతీయ రాజ‌కీయాల‌పై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టిన చంద్ర‌బాబు… వాటి మీద ఫోక‌స్ పెట్ట‌డం, ఏపీలో మ‌రోసారి అధికారంలోకి రావ‌డ‌మే లక్ష్యంగా వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో తెలంగాణలో ప్ర‌చారంపై కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ పోటీ లోక్‌స‌భ‌కు పోటీ చేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించింద‌ట‌. పోటీయే లేన‌పుడు ఇక తెలంగాణ‌లో ప్ర‌చారం సంగ‌తి కూడా ఉండ‌దు.
ఎన్నిక‌ల వ్యూహ ప‌థ‌కాల‌తో అపుడే మోడీ రాజ‌కీయాలు వేడెక్కిస్తుంటే.. వాటిని బీజేపీ వ్య‌తిరేక కూట‌మి దీటుగా ఎదుర్కోవ‌డానికి అస‌వ‌ర‌మైన స‌న్నాహాలు చేస్తున్నారు చంద్ర‌బాబు. అందుకే తెలంగాణ‌లో ఎలాగూ కొత్త ప్ర‌భుత్వం, జ‌నాల్లో అంత వ్య‌తిరేక‌త తొలినాళ్ల‌లో ఉండ‌దు, పైగా అధికారంలో ఉన్న‌వారికి పొలిటిక‌ల్ మేనేజ్‌మెంట్ సులువు అవుతుంది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌కు ఇచ్చే ఒక్క రోజు స‌మ‌యం అయినా వృథా కిందే అవుతుంద‌ని భావించిన చంద్ర‌బాబు ఆ ఎన్నిక‌ల‌కు దూరంగా ఉందామ‌ని భావించిన‌ట్టు చెబుతున్నారు.
గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ మ‌ల్కాజిగిరి లోక్‌స‌భ స్థానం ద‌క్కించుకుంది. అసెంబ్లీ విజ‌యంతో ఊపుమీదున్న కేసీఆర్ అసెంబ్లీ స‌మావేశానికి ముందే కాంగ్రెస్ మొత్తాన్ని త‌న‌లో క‌లిపేసుకోవాల‌ని చూస్తున్నారు. ఈ వ్యూహం ఎటుదారితీస్తుందో చూడాలి.
ఇక చంద్ర‌బాబు తీసుకున్న తాజా నిర్ణ‌యం వ‌ల్ల వ‌చ్చే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లోని మొత్తం 17 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులే బ‌రిలో ఉండ‌నున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article