ప్రజలు ఎవరిని అసహ్యించుకుంటున్నారా?

Telangana People Hates BJP Leaders?

  • మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

కేంద్రప్రభుత్వం అంటే చక్రవర్తులు కారు .. రాష్ట్రాలు వారికి సామంతులు కారు. రూపాయి ఇచ్చింది లేదు ..రాళ్లు విసిరి పోతున్నారు. గతంలో లో  కొంత మంది కేంద్ర మంత్రులు  మిషన్ కాకతీయను, మిషన్ భగీరథ ను పొగిడి వెళ్లారునిన్న వచ్చిన వాళ్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వెళ్లారు. బీజేపీ నేతలను  చూసి తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఇష్టారాజ్యంగా మాట్లాడడం కేంద్రంలోని వ్యక్తులకు తగదు దేశానికి దారిచూపే పథకాలను తెలంగాణ ప్రభుత్వం రూపొందిస్తుందని పేర్కొన్న నీతి అయోగ్ 24 వేల కోట్లు గ్రాంటుగా ఇవ్వాలని కేంద్రానికి సూచించింది. కనీసం 24 రూపాయలు ఇవ్వడం చేతకాని వాళ్లు విమర్శించడం సిగ్గుచేటు. దేశంలో ఎక్కడయినా బీజేపీ ప్రభుత్వం 5, 6 లక్షల ఎకరాలకు నీరందించే ఒక్క ప్రాజెక్టు అయినా కట్టించారా అని ప్రశ్నించారు. యూపీలో మరుగుదొడ్లు కట్టించి అదే మా ఘనకార్యం అని దేశం మొత్తం ప్రచారం చేసి మతోన్మాదం రెచ్చగొట్టి ఓట్లు రాబట్టుకుని తెలంగాణ ప్రభుత్వంపై నిందలు మోపడానికి బీజేపీ సిగ్గులేదా ?

కాళేశ్వరం ప్రాజెక్టు 3 సంవత్సరాలలో పూర్తి చేసి రైతులకు నీళ్లు అందిస్తుంటే కేంద్రంలో ఉన్న ఉన్నతాధికారులు అధికారులు ప్రశంసించారు .. కానీ బీజేపీ నేతలు సిగ్గుమాలిన, నీతిమాలిన ఆరోపణలతో తెలంగాణ ఖ్యాతిని తగ్గించాలని కుట్రలు చేస్తున్నారు. తెలంగాణ మీద విషం కక్కే పనులు చేయడం బీజేపీ నేతలకు తగదని .. ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారని అన్నారు. రాజ్యాంగబద్దంగా ఎన్నికలలో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాం. కేంద్రంతో ఘర్షణ పెట్టుకోవాలన్నది తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశం కాదు. తెలంగాణను అభివ్రుద్దిని చిన్నగా చేయాలని చూస్తే సహించం.. తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరు. 

రైతాంగానికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తాను. ఇప్పటికే ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయమని పార్లమెంట్ లో మన ఎం.పి లు కోరడం జరిగింది…. దీని ద్వారా  రైతులకు మేలు జరగుతుంది. రైతు బంధు , రైతు భీమా ఇలాంటి మంచి పథకాలు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకొచ్చారు. దాదాపు 60 శాతం ప్రజలు వ్యవసాయం నుండి జీవనోపాధి పొందుతున్నారు.. ఆహారం బలోపేతం కావాలంటే ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సిందే. తెలంగాణ ప్రభుత్వం 51 లక్షల మంది కి రైతు బంధు  పథకం ఇచ్చాము.ఇప్పటికే రెండు దశలు పూర్తి చేసాంఅణునిత్యం నేరుగా రైతుల అకౌంట్ లోకి వెళ్తాయిమిగతావి కూడా త్వరలో విడుదల చేస్తాం.ఇందులో ఎవ్వరు అనుమానం పడాల్సిన అవసరం లేదు.

TRS ATTACK ON BJP 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *