కొత్త రేషన్ కార్డ్ ల పంపిణీ

కొత్తగా మంజూరైన రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధమైంది.సోమవారం రోజున ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు గాను అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటలకు సూర్యపేట జిల్లా కేంద్రంలోని మంత్రి జగదీష్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో 12 గంటలకు నల్లగొండ జిల్లా కేంద్రంలోని యం ఆర్ ఓ కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు యదాద్రిబోనగోరి జిల్లా చౌటుప్పల్ పురపాలక సంఘం పరిధిలోని యస్ ఆర్ యం ఫంక్షన్ హాల్ లో మంత్రి జగదీష్ రెడ్డి లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులుఅందజేయనున్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం రాష్ట్ర ప్రభుత్వం నూతన రేషన్ కార్డులు అందించాలి అనే నిర్ణయానికి అనుగుణంగా సోమవారం నుండి ఉమ్మడి నల్గొండ జిల్లాలో పంపిణీ చేయబోతున్నారు.అర్జీదారుల అర్జీలను కాచి వడపోసిన మీదట ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 26,702 మంది లబ్ధిదారులకు రేషన్ కార్డులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. నల్లగొండ జిల్లాలో11,395,సూర్యపేట లో 9,373 యదాద్రిబోనగోరి జిల్లాలో 5,934 రేషన్ కార్డులు కొత్తగా మంజూరు అయ్యాయి.లబ్ధిదారులకు ఈ నెల 26 నుండి 30 వరకు అందజేసేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి..అర్హులైన కుటుంబాలకు ఆగస్టు నుంచి రేషన్ అందేలా అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article