సులువుగా రిజిస్ట్రేషన్లు ఇలా

Telangana Registration Process Easy

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయములు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. కార్యాలయములలో దస్తవేజుల రిజిస్ట్రేషన్ లు, స్టాంపుల అమ్మకం, E.C. మొదలగు అన్ని సేవలు అందుబాటులో ఉన్నాయి. దస్తావేజులు రిజిస్ట్రేషన్ చేసుకునేవారు registration.telangana.gov.in అనే వెబ్ సైట్ లో పబ్లిక్ డాటా ఎంట్రీ ద్వారా వారి దస్తావేజుల వివరాలు నమోదు చేసుకొని, స్టాంపు డ్యూటి వంటివి ఆన్ లైన్ లో చెల్లించి, వారు ఏ రోజున రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆన్ లైన్ లో స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆ సమయంలో సంబంధిత కార్యాలయానికి వెళ్లాలి. స్లాట్ బుక్ చేసుకున్న సమయంలో సంబంధిత కార్యాలయానికి వెళ్లడానికి అనుమతి పత్రం (పాస్) కూడా ఆన్ లైన్ లో లభిస్తుంది. పోలీస్ చెక్ పోస్టుల వద్ద పోలీస్ శాఖ అభ్యంతరం తెలిపితే అట్టి పాస్ చూపిస్తే వెళ్లడానికి అనుమతి లభిస్తుంది.

దస్తావేజులు ఆన్ లైన్ లో నమోదు చేసుకుని, స్టాంపు డ్యూటీ వంటివి చెల్లించి ఏవైనా కారణాల వలన కార్యాలయానికి  వెళ్లలేకపోతే, తర్వాతి రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని గుర్తుంచుకోండి. ఈసీ మరియు దస్తావేజు నఖలు “మీ సేవ” నుండి మాత్రమే పొందాలి. లేదా registration.telangana.gov.in వెబ్ సైట్ నుండి ఆన్ లైన్ లో రుసుము చెల్లించి ఈసీ,  దస్తావేజు నఖలును పొందవచ్చును.

రాష్ట్రం లోని అన్నీ కార్యాలయాల్లో కరోనా నేపధ్యంలో తీసుకోవాలిసిన అన్ని జాగ్రత్తలు అనగా భౌతిక దూరం పాటించడం, కార్యాలయానికి వచ్చే ప్రజలు చేతులు శుభ్రపరచుకోవడానికి నీరు, సబ్బు మరియు శానిటైజర్ లను అందుబాటులో ఉంచాలని, సబ్ రిజిస్ట్రార్లకు గతంలోనే అదేశించారు. కార్యాలయానికి వచ్చే ప్రజలు తప్పని సరిగా మాస్కు ధరించి రావాలి మరియు భౌతిక దూరం పాటించాల్సి ఉంటుంది. పైన పేర్కొన్న ఏ సేవలలోనైనా ఇబ్బందులు ఎదురైతే రిజిస్ట్రేషన్ శాఖ టోల్ ఫ్రీ నంబర్ 18005994788 కు ఫోన్ చేసి గాని, వాట్సప్ సెల్ నంబర్ 91212 20272 కు వాట్సప్ లో సందేశం పంపి గాని సమస్యను పరిష్కరించుకోవాలని హైదరాబాద్ డీఐజీ సుబ్బరావు కోరారు.

Telangana Registrations Update

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article