ఘనచరిత్ర గల సెక్రటేరియట్ కనుమరుగు?

Telangana Secreteriat Golden History

1952 లో హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన బూర్గుల రామకృష్ణారావు కాలం నాటినుంచి ఈ సచివాలయం సేవలందిస్తుంది. 1956 లో రాయలసీమ, కోస్తాలను కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడు నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. నాటి నుంచి నేటి వరకు ఎందరో ముఖ్యమంత్రులకు ఆ సచివాలయం తన సేవలను నిరంతరాయంగా అందిస్తూ సాక్షీభూతంగా నిలిచింది అనటంలో అతిశయోక్తి లేదు. హేమాహేమీలు నీలం సంజీవరెడ్డి 1956-60, ఆ తర్వాత దామోదరం సంజీవయ్య, మళ్లీ 1964లో నీలం సంజీవ రెడ్డి, 1964, ఫిబ్రవరి 29న కాసు బ్రహ్మానందరెడ్డి, 1971-73 వరకు పీవీ నరసింహారావు, 1973-78 వరకు జలగం వెంగళరావు, 1978-80 వరకు డా. మర్రి చెన్నారెడ్డి, 1980-82 వరకు టంగుటూరి అంజయ్య, 1982 ఫిబ్రవరి 24-సెప్టెంబర్ 20 వరకు భవనం వెంకట్రామ రెడ్డి, 1982 సెప్టెంబర్ 20-1983, జనవరి 9 వరకు కోట్ల విజయభాస్కర్ రెడ్డి, 1983-84 వరకు నందమూరి తారక రామారావు, 1984 ఆగస్టు 16-1984 సెప్టెంబర్ 16 వరకు నాదెండ్ల భాస్కరరావు, 1984-1985 వరకు మళ్లీ ఎన్టీఆర్, ఆ తర్వాత 1985-1989 వరకు మళ్లీ ఎన్టీఆర్, 1989-90 వరకు మర్రి చెన్నారెడ్డి, 1990-92 వరకు నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, 1992-94 వరకు కోట్ల విజయభాస్కర్ రెడ్డి, 1994-95 వరకు ఎన్టీఆర్ ముఖ్యమంత్రులుగా వ్యవహరించారు. ఈ మహామహులు అంతా కూడా ఇదే సచివాలయం నుంచి పాలన కొనసాగించారు.

ప్రగతి భవన్ నుంచి పాలన

ఇక 1995-2004 వరకు చంద్రబాబు నాయుడు, 2004-2009 వరకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, 2009-10 వరకు కొణిజేటి రోశయ్య, 2010-2014 వరకు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ సచివాలయం నుంచే పాలన కొనసాగించారు. ఐతే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014-19 వరకు ఈ సచివాలయం నుంచే పాలన కొనసాగింది. ఆ తరవాత ముఖ్యమంత్రి కార్యకలాపాల కోసం ప్రభుత్వం ప్రగతి భవన్ను నిర్మించింది. అప్పటి నుంచి సీఎం కేసీఆర్ అక్కడి నుంచే పాలన కొనసాగిస్తూ వస్తున్నారు. మంత్రులు, సచివులు కొలువుండే సచివాలయం మాత్రం యధావిధిగా కొనసాగింది.

Telangana Secretariat Updates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *