పాపం సింగిరెడ్డికి ఎంత కష్టమొచ్చింది?

49
Telangana Solved Urea Scarcity
Telangana Solved Urea Scarcity

Telangana Solved Urea Scarcity

పాపం సింగిరెడ్డికి ఎంత కష్టం వచ్చింది? యూరియా బస్తాలతో ఫోటోలు దిగి.. అక్కడి కార్మికులు, అధికారులు, సిబ్బందితో ఫోటోలు దిగి..మరి తెలంగాణ మీడియాకు పంపించారు. అంతేకాదు, అవే ఫోటోలు కేసీఆర్ కు కూడా పెట్టడం జరిగింది. దీని ద్వారా తాము పని చేస్తున్నామనే సంకేతం సీఎంకు పంపించారని తెలిసింది.

రోడ్డు, రైల్వే అన్ని మార్గాలను ఉపయోగించుకుంటున్నాం.. కేసీఆర్ గారి నాయకత్వంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.. రబీకి కూడా యూరియా నిల్వలు సిద్దం చేస్తున్నాం.. ఇప్పటి వరకు గత వారం రోజులలో అన్ని పోర్టుల నుండి ఎన్ఎఫ్ఎల్ యూరియా 20,387 వేల మెట్రిక్ టన్నుల సరఫరా, విశాఖ నుండి 6800 మెట్రిక్ టన్నులు, ఐపీఎల్ యూరియా 15 వేల మెట్రిక్ టన్నులు సరఫరా, 2600 మెట్రిక్ టన్నులకు అదనంగా మరో 2600 మెట్రిక్ టన్నులు కలిపి రేపటి నుండి రోజుకు 5,200 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకు నిర్ణయం తీసుకున్నామని, యూరియా సత్వర రవాణాకు పోర్టు నుండి సంపూర్ణ సహకారం ఉంటుందని హామీ ఇచ్చిన గంగవరం పోర్టు సీఈఓ, ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు గారికి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  ధన్యవాదాలు తెలిపారు. ఆయన గంగవరం పోర్టులో యూరియా సత్వర రవాణాకు పోర్టు అధికారులు, తెలంగాణ నుండి వచ్చిన ప్రత్యేక అధికారులతో సమావేశమయ్యారు. గంగవరం పోర్టులో వియత్నాం నుండి వచ్చిన యూరియా నౌక సందర్శించారు. తెలంగాణకు సరఫరా చేసేందుకు సిద్దమవుతున్న యూరియా గోడౌన్, వ్యాగన్ ల పరిశీలించారు. మరి, ఆయన ఏం పరిశీలించారో ఎవరికీ అర్థం కాలేదు. ఇది కేవలం తాము పని చేస్తున్నామని సీఎంకు చెప్పడానికి చేసిన ప్రయత్నమంటూ ప్రతిఒక్కరూ అనుకుంటున్నారు. మంత్రి దౌర్భాగ్యం ఏమిటంటే.. తెలంగాణకు యూరియా సరఫరా చేసేందుకు అక్కడి కార్మికులు, రవాణాదారులకు విజ్ఞప్తి చేశారు. అవసరమైతే మూడు షిప్టులలో పని చేయాలని కోరగా సహకరిస్తామని కార్మికులు చెప్పారట. సీఎం కేసీఆర్ను కాకా పట్టడానికెంత కష్టపడుతున్నారో చూడండంటూ నెటిజెన్లు అనుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here