Saturday, December 28, 2024

రాచరిక పోలికలున్న రాష్ట్ర చిహ్నాన్ని మారుస్తాం

టీఎస్​న్యూస్​: రాష్ట్ర అధికారిక చిహ్నం మారుస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. జయజయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా మార్చుతామని, తెలంగాణ తల్లి విగ్రహం సగటు తెలంగాణ బిడ్డలా లేదని, బండ్లపైనే కాదు.. మా గుండెలపై కూడా టీజీ రాసుకున్నామన్నారు. రాష్ట్రంలో రాచరిక పోకడలు ఉండకూడదన్నదే తమ విధానం అని, రాచరికపు పోలికలు ఉన్న రాష్ట్ర రాజముద్రను మారుస్తామని ప్రకటించారు. ఇక, ప్రతిపక్షాల విమర్శలు పిల్లిపెట్టే శాపనార్థాల్లా ఉన్నాయని, 100 రోజులు పూర్తి కాకముందే ఎందు ఈ శాపనార్థాలు అని ఫైర్ అయ్యారు. ఎంతో మంది త్యాగాలతో తెలంగాణ సాధించుకున్నామని, తెలంగాణ అంటే ఓ భావోద్వేగం.. గత ప్రభుత్వ హయాంలో పోలీసుల అణచివేతలు, అవమానాలు ఎదుర్కొన్నామని, తొమ్మిదేళ్లైనా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఇంకా నెరవేరలేదు అని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు వేయడానికి కొన్ని సార్లు 5 నెలలు, కొన్ని సార్లు 9 నెలలు ఇలా అధిక సమయం పట్టిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు కాకముందే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని సీఎం రేవంత్​ఎద్దేవా చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com