ఈ- పంచాయతీ మనమే టాప్

తెలంగాణ ఏర్ప‌డ్డాక‌ గాంధీజీ క‌ల‌లు క‌న్న గ్రామ స్వ‌రాజ్య స్థాప‌న‌కు సీఎం కేసీఆర్ ప‌ల్లె ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాన్ని ఆరంభించారని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గ్రామ పంచాయతీల్లో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ తో పారదర్శకత, సమర్థత, జవాబుదారీతనం పెంపొందిస్తున్నారని తెలిపారు.

63
TELANGANA TOPS IN E-PANCHAYATH
TELANGANA TOPS IN E-PANCHAYATH

ఈ మధ్య అవార్డుల మీద అవార్డులు సాధిస్తున్న తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ తాజాగా మరో అవార్డును గెలుచుకుంది. గ్రామ పంచాయతీలలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ తో పారదర్శకత, సమర్థత, జవాబుదారీ తనం పెంపొందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ నెంబర్ వన్ అంటూ కేంద్రం ప్రకటించింది. ప్రతి ఏటా కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ ఈ పంచాయత్ పురస్కారాలను అందచేస్తున్నది. ఈ ఏడాది 2019-20 కి ఈ e-award దక్కింది. దేశంలోని గ్రామ పంచాయతీ లను ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ తో పారదర్శకత, సమర్థత, జవాబుదారీ తనం పెంపొందిస్తున్న గ్రామాలను మూడు విభాలుగా విభజించింది.

పంచాయతీ ఎంటర్ ప్రైజ్ సూట్అప్లికేషన్స్ అండ్ స్టేట్ స్పెసిఫిక్ అప్లికేషన్లలో మూడు విభాగాలుగా విభజించింది. అందులో 2వ విభాగంలో తెలంగాణ మొదటి స్థానం దక్కించుకోగా, రెండో స్థానం ఆంధ్ర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మూడో స్థానం రాజస్థాన్ కు వచ్చింది. ఈ అవార్డు రావ‌డం ప‌ట్ల రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. అవార్డు ప్రకటించినందుకు కేంద్రానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ అవార్డులు రావ‌డానికి కార‌ణ‌మైన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మార్గ‌ద‌ర్శి సీఎం కేసీఆర్ కి ధ‌న్య‌వాదాలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here