తెలంగాణా గ్రామాలు ఏకగ్రీవం

Telangana Villages

తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న పంచాయతీ పోరులో చాలా గ్రామాలు ఏకగ్రీవం వైపే మొగ్గు చూపుతున్నాయి. ఈ పంచాయితీ ఎన్నికల విషయాలలో ఏకగ్రీవం అంశాన్ని ప్రస్తావించొద్దని ఇప్పటికే ఎన్నికల అధికారులు చెప్పినప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లో మాత్రం ఆ మాటలని పెడ చెవినపెట్టారనిసమాచారం. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు వేలం పాటలు నిర్వహిస్తే చట్టప్రకారం చర్యలుంటాయని జిల్లా ఎన్నికల అధికారులు ప్రకటించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసుశాఖ సైతం హెచ్చరించింది. అయినా సరే చాలా గ్రామాల్లో ప్రజలు సర్పంచ్ ఎన్నికను ఏకగ్రీవం చేస్తున్నారు.

తెలంగాణలోజరిగే తొలివిడత గ్రామా పంచాయితీ ఎన్నికల్లో దాదాపుగా గ్రామాలన్నీ కూడా ఏకగ్రీవానికి మొగ్గు చూపుతున్నాయి… సిద్ధిపేట జిల్లాలో హరీష్ దత్తత గ్రామం ఎన్నికను ఏకగ్రీవం చేసి తోలి బోణీ కొడితే తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని చింతలపల్లి పంచాయతీ సర్పంచ్‌గా లడె సమ్మక్కను అక్కడి ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వారి ఏకగ్రీవానికి మాజీ స్పీకర్ మధుసూదనాచారి వారికీ అభినందనలు తెలిపారు.
భూపాలపల్లి మండలంలోని వజినపల్లి సర్పంచ్‌గా తాళ్లపల్లి స్వామిగౌడ్‌ను, ఆముదాలపల్లి సర్పంచ్‌గా బౌతు రమాదేవిని ఎన్నుకున్నారు. వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలం మల్కినియాన్‌పల్లిలో కప్పెట శాంత, గోపాల్‌పేట మండలంఅనంతపూర్‌లో ఎద్దుల బాల్‌రెడ్డి ఏకగ్రీవమయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం అచ్యుతాపురం సర్పంచ్‌గా కృష్ణవేణిని ఎన్నుకున్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం నర్సంపల్లి గ్రామస్థులు పనాల సత్తమ్మను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరు ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిని కలిసి టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఒకవైపు ఎన్నికల అధికారులు ఎంత చెబుతున్న కూడా వినకుండా ఎవరికి తోచిన విధంగా వారు ప్రవర్తిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article