టెస్టులు ఎందుకు తగ్గించారు : హైకోర్ట్ సీరియస్

42
Telengana Highcourt serious On Ts Goverment
Telengana Highcourt serious On Ts Goverment

Telengana Highcourt serious On Ts Goverment

మహారాష్ట్రలో రోజుకు లక్షన్నర కరోనా పరీక్షలు చేస్తున్నారని, రోజుకు 40 వేల పరీక్షలు చేస్తామన్న హామీ ఎందుకు అమలు కావడం లేదని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వంపై సీరియస్ అయ్యింది.  కరోనా పరీక్షలు ఎందుకు తగ్గించారో తెలపాలని ప్రశ్నించింది. కరోనా వైరస్‌కు సంబంధించిన వ్యాజ్యాలపై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలకు అనుగుణంగా ఆస్పత్రుల్లో బెడ్లు ఎందుకు లేవని, మిగతా రాష్ట్రాల కన్నా ఎందుకు వెనకబడి ఉన్నారో తెలపాలంది. వెయ్యి మందికి కనీసం మూడు బెడ్లు కూడా లేక పోవడానికి కారణాలు, ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ బెడ్లు పెంచే ప్రణాళికలు ఉన్నాయో లేదో తెలపాలని  ఆదేశించింది.

పక్క రాష్ర్టమైన ఆంధ్రప్రదేశ్ లో కరోనా టెస్టులు జరుగుతున్నాయని, తెలంగాణలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ డాక్టర్లు లక్షణాలు ఉంటేనే టెస్టులు చేస్తామని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కిట్ లు కూడా సక్రమంగా అందడం లేదని కొంతమంది ఆరోపిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here