కేసీఆర్ సారూ.. ఇవి గుర్తున్నయా!

61
KCR OUT OF DANGER
KCR OUT OF DANGER

#Telengana people hard comments on KCR#

తెలంగాణలో టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చినా ప్రజలకు పెద్దగా ఓరిగిందేమీ లేదు. ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ 24 అంశాలపై హామీలు ఇచ్చింది. అప్పటికే అమల్లో ఉన్న పథకాల్లో ప్రయోజనాల పెంపు కొన్నికాగా, కొత్తగా మరిన్ని ప్రకటించారు. కీలక హామీల్లో ఒకట్రెండు మాత్రమే ఆచరణలోకి వచ్చాయి. రైతు బంధు ఆర్థిక సాయాన్ని పెంచినా.. లక్షలాది మందికి సొమ్ము అందలేదు. రుణ మాఫీ జాడే లేకుండా పోయింది. సొంత స్థలం ఉన్నవాళ్లకు డబుల్​ బెడ్రూం ఇండ్లు కట్టుకునేందుకు డబ్బులిస్తామని సీఎం కేసీఆర్​ చెప్పినా ఒక్కటి ఆచరణకు నోచుకోలేదని తెలంగాణ ప్రజలు అంటున్నారు.

రుణమాఫీ ఎదురుచూపులే..

పంటల పెట్టుబడులకై రైతులు బ్యాంక్‌ల నుంచి తీసుకున్న రుణాలు ఎప్పుడు మాఫీ అవుతాయోనని రైతు లు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పంటల రుణమాఫీకై రూ. 6 వేల కొట్ల నిధులను కేటాయించింది. పంట రుణ మాఫీకి ప్రభుత్వ నిధులు కేటాయించినప్పటికీ మార్గద ర్శకాలను జారీ చేయకపోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన పంట రుణాల మాఫీ అమలు కావడం లేదు. రుణాలు తీసుకున్న రైతులు ఎప్పుడు మాఫీ అవుతుందోనని ఆశగా ఎదురు చూస్తున్నారు. రుణాలు పొందక పంటల సాగుకోసం రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వం స్పందించి వెంటనే పంటల రుణాలను మాఫీ చేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

వరద సాయం ఎక్కడ?

గతంలో ఎన్నడూ లేనతంగా వర్షాలు హైదరాబాద్ ను అతలాకుతలం చేశాయి. ఎన్నో బస్తీలు రోడ్డున పడ్డాయి. నిరుపేదలు సర్వం కోల్పోయాయి. తెలంగాణ ప్రభుత్వం వరద సాయం ప్రకటించినా ఇంకా అందలేదని పలు బస్తీలు ఆరోపిస్తున్నాయి. పీర్జాదిగూడ, బోడుప్పల్‌ కార్పొరేషన్ల పరిధిలోని అనేక గ్రామాలు ఇంకా వరదలోనే ఉన్నాయి. కొందరు ఇళ్లు ఖాళీ చేసి బంధువుల, స్నేహితుల ఇళ్లకు వెళ్లిపోయారు. మరికొందరు పై అంతస్తుల్లోనే ఉంటున్నారు. మేడిపల్లి సుమా రెసిడెన్సీలో దాదాపు 150 ఇళ్లు నీట మునిగాయి. వరద ముంపుతో ఒక్కొక్కరి ఇళ్లలో లక్షలాది రూపాయల విలువ చేసే సామగ్రి, నిత్యావసరాలు తడిసి ముద్దయ్యాయి. దీంతో ఆవేదన చెందుతున్న బాధితులు తమను ఆదుకోవడంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా చోట్ల పది వేలకు బదులు ఐదు వేలు ఇస్తున్నారని బాధితులు ధర్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం పక్కాగా సాయం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.

దళితులకు భూమి ఏదీ?

దళితులకు భూములు పంపిణీ చేస్తామని పదేపదే హామీ ఇచ్చారు. భూములు పంచడమే కాకుండా అభివృద్ధి చేసే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంటుందన్నారు. ఎకరం ఉన్నోళ్లకు రెండెకరాలు, రెండెకరాలుంటే ఇంకో ఎకరం.. ఇలా ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఉండేలా చూస్తామని స్పష్టం చేశారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పెట్టి ఎన్నికల ప్రచార సభలన్నింటా ఇదే ఎజెండాపై ఫోకస్ చేశారు. ఎంతమందికైనా భూమి ఇచ్చేందుకు సిద్ధమంటూ సీఎం అయ్యాక దళితులకు మూడు ఎకరాల భూమి విషయమే మరిచిపోయారని దళిత సంఘాలు మండిపడుతున్నాయి. ‘దొర మాకు భూములు ఎప్పుడు ఇస్తవ్’ అంటూ వేడుకుంటున్నాయి.

మాకొద్దు ఎల్ఆర్ఎస్

తాజాగా ప్రభుత్వం చేపడుతున్న ఎల్​ఆర్​ఎస్​, ఆస్తుల సర్వేపై ప్రతిపక్షాలే కాదు, సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ భూముల జోలికి రాబోమని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్​.. ఇప్పుడు ఎల్​ఆర్​ఎస్​ పేరుతో నోటిఫైడ్​ ప్రాంతంలోని భూములను గిరిజనేతరులకు రెగ్యులరైజ్​ చేసే కుట్రకు తెరలేపారని ఆరోపిస్తున్నారు. కేసీఆర్ చెప్పొదొకటి, చేసేదొక్కటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here