జగన్ రేట్ చెప్పండి నా తాళిబొట్టు అమ్మేస్తా…

63
Jagan Case Postponed
Jagan Case Postponed

Tell Me CM YS Jagan Cost Asking Women

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయం ఆందోళనకరంగా మారుతుంది. రోజురోజుకి ఈ అంశం తారాస్థాయికి చేరుతుంది. ఏపీ రాజధాని కోసం ముందుగా అమరావతిని నిర్ణయించింది గత టీడీపీ ప్రభుత్వం. అయితే టీడీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని కాదని వైసీపీ ప్రభుత్వం రాజధాని మార్పుకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఏపీ రాజధానిని విశాఖకు తరలించేందుకు సన్నాహాలు చేస్తుంది జగన్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో రాజధానికోసం తమ భూములిచ్చిన రైతులు ఆందోళనలు చేపట్టారు. రాజధానిగా అమరావతి కొనసాగించాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆందోళనలు చేస్తున్న రైతులు పెయిడ్ రైతులంటూ వైసీపీ నేతలు చేసిన ఆరోపణలపై భగ్గుమన్నారు రైతులు. తమకు డబ్బులిచ్చి ఆందోళనలు చూపిస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలపై మందడానికి చెందిన ఓ మహిళా రైతు సవాల్‌ చేశారు. మేము పెయిడ్ రైతులమైతే సీఎం జగన్ కి కూడా ఓ రేటు ఉంటుంది కదా ఆ రేటేదో చెప్పాలంటూ ఆమె సవాల్ విసిరారు. ఈ మేరకు ఆమె వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మా ఆస్తులు అమ్ముతాం. మా తాళిబొట్లు, మెట్టెలు అమ్ముతాం. అవసరమయితే మా ప్రాణాలు అమ్మేసయినా సరే.. మిమ్మల్ని కొంటాం అంటూ ఆమె వైసీపీ నేతలకు సవాల్ విసిరింది.

Tell Me CM YS Jagan Cost Asking Women,Rajadhani Women Shocking Comments On CM YS Jagan,AP CM YS Jagan,3 Capital,Amaravthi Protes,Is Amaravati Formers Paid Arists?,AP Politics,CM Jagan Rate

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here