ఆ నలుగురులా.. ఈ నలుగురు వచ్చారా..?

56
telugu cinema
telugu cinema

telugu cinema

మూడు దశాబ్ధాలుగా తెలుగు సినిమాకు మెయిన్ హీరోలు అంటే ఆ నలుగురు అని చెప్పుకున్నారు. ఆ నలుగురూ మెగాస్టార చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ అని వేరే చెప్పక్కర్లేదు. ఏ పెద్ద సినిమా అయినా, దర్శకుడైనా, హీరోయిన్ అయినా వీరితో సినిమా అంటే నో చెప్పే పరిస్థితి అప్పుడు లేదు. అందర్లోనూ చిరంజీవి టాప్ అనిపించుకున్నా.. ఎవరికి తగ్గ రేంజ్ వారు క్రియేట్ చేసుకున్నారు. తర్వాత ఆ నలుగురులా మరో టీమ్ వచ్చింది. ఆ టీమ్ లో రెండు నంబర్స్ పెరిగాయి. ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్. ప్రస్తుతం టాలీవుడ్ ను దున్నేస్తున్నది వీరే. ఆ తర్వాత మరికొందరు ఉన్నా.. వీరి తర్వాతే అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే వీరికి తగ్గ రేంజ్ లో మనకు హీరోయిన్లు ఉన్నారా అనేది పెద్ద ప్రశ్న. కాకపోతే పాత తరం హీరోల్లాగా ప్రస్తుతం టాలీవుడ్ లో నలుగురు హీరోయిన్లు హవా చేస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ ఫామ్ లో ఉన్న హీరోయిన్లు ఎవరు అంటే టక్కున చెప్పే ఆన్సర్.. పూజాహెగ్డే. చాలా తక్కువ టైమ్ లోనే ఈ డస్కీ బ్యూటీ తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. అందుకే టాప్ హీరోలందరూ ఈ భామే కావాలంటున్నారు. తన కాళ్లను పట్టుకు వదలనంటున్నారు. సో పూజా టాప్ ప్లేస్ లోనూ ఉందనే చెప్పొచ్చు. ఇక రష్మిక మందన్నా.. పూజాహెగ్డే లాగానే ఓ స్మాల్ హీరోతో పరిచయం అయింది. బట్ గీత గోవిందంతో టాప్ లీగ్ లోకి ఎంటర్ అయింది. ఏకంగా మహేష్ బాబు సరసన ఆఫర్ కొట్టేసింది. ప్రస్తుతం అల్లు అర్జున్ తోనూ నటిస్తోంది.

పైగా రేంజ్ మారింది కదా.. ఇంక నో స్మాల్ హీరోస్ అని కూడా అంటోంది. మరోవైపు ఈవిడ ఉంటే సినిమా హిట్ అనే సెంటిమెంట్ నూ రుద్దుతున్నారు. కీర్తి సురేష్.. తనూ అంతే. రామ్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్యూట్ లుక్స్ తో కుర్రాళ్లను పడేసింది. తర్వాత ఇమ్మీడియెట్ గా పవన్ కళ్యాణ్ సరసన ఛాన్స్ పట్టేసింది. అయితే మహానటి తర్వాత కీర్తికి స్టార్ హీరోల సరసన ఆఫర్స్ తగ్గినా.. ఇప్పటికీ తను చాలామందికి హాట్ ఫేవరెట్. ఈ లిస్ట్ లోనే ఉన్నా పై ముగ్గురికీ పూర్తి భిన్నమైన నటి సాయి పల్లవి. తనూ టాలీవుడ్ కి ఇప్పుడు మోస్ట్ ఫేవరెట్. కానీ గ్లామర్ విషయంలో చాలా హద్దులున్నాయి. కథ నచ్చితేనే చేస్తుంది. కాసుల కోసమో లేక స్టార్స్ ఉన్నారనో కమిట్ అయ్యే టైప్ కాదు. అయినా తనకూ తిరుగులేని ఫ్యాన్స్ ఉన్నారు. మొత్తంగా ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ నలుగురుదే హవా. వీరికి ముందు ఉన్న అనుష్క, కాజల్, తమన్నా, సమంత, నయనతార వంటి భామలు హవా చేసినా.. ఇప్పుడు వాళ్లంతా ఫేడవుట్ స్టేజ్ లోనే ఉన్నారు. అంచేత మరికొంత కాలం పాటు టాలీవుడ్ ఈ నలుగురు భామలదే అని చెప్పొచ్చు.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here