Telugu Daily News
ప్రభావ శీలక స్రవంతిని అధ్యయనం చేస్తున్నాను..ప్రభావ గతుల తార్కికాన్ని గమనిస్తున్నాను..పథకానికి, చట్టానికి తేడా తెలి యకుండానే వార్తలు రాస్తు న్నారే వీరు అని నివ్వెరపోతున్నాన్నేను..ప్రస
నాన్న గురించి మీరు రాస్తున్నారొక చోట నాన్నంటే ఏంటన్నది చెబుతున్నా రు..పొలాల్నీ,పంటల్నీ, పశువుల్నీ,పక్షుల్నీ మనుషులతో సమానంగా ప్రేమిం చిన మట్టి మనిషి నాన్న అని..మానుకొంట వెంకటయ్యను స్మరిస్తున్నారొక చో ట.. అలాంటి ఆరంభం నుం చి నేను మిమ్మల్ని అర్థం చేసు కుంటున్నాను..ప త్రికల్లో ఏం వస్తున్నాయో చెప్పగలను..ఆకలి చావులను అర్థం చేసుకోకుండా రాస్తున్న కథనాలు చూసి కోపం తెచ్చుకుంటున్నాను..ఆత్మ పరిభాషకు మీ కు మీరు ప్రాధాన్యం ఇవ్వడం మరిచిపోయారే అని బాధ పడుతున్నాను..ఇవేవీ లేని చోట, వాటి ఆవశ్యతకు గొప్ప విలువ ఇచ్చి, ఈనాడు కన్నా పరుగులు తీ సి ఉరుకులు తీసి నేను ఓ పాత్రికేయునిగా పరుగులు తీస్తున్నాను.. చెప్పాను కదా! ఈనాడు విలేకరి కన్నా వేగంగా రాయగలను.. నాణ్యతతో రాయగలను …ఇప్పుడక్కడ రైటర్స్ లేరు..మరి! మీ దృష్టిలో ఎవరు రైటర్ ?? ఇప్పుడున్న ఇక్కడున్న వారెవ్వరూ కాదు..నాతో సహా మీతో సహా.. మిమ్మల్నొక గుడ్ అ డ్మిన్ గానే పరిగణిస్తాను కానీ గుడ్ రైటర్ గా చూడను..ఎందుకంటే ఆ గుణ ని ష్పత్తి వేరు.. చెప్పాను కదా! సంశ్లేషణ, విశ్లేషణ గతులకు ఓ రాత తూగాలంటే అందుకు ఎన్నో కారణాలు దోహదం అవుతాయి అని! అవి ఇవాళ ఎవ్వరిలో నూ లేవు..సోది రాస్తున్నారంతే..హాహా నాతో సహా అనుకోండి పోనీ.. హాహా.. స్వీయ లోపంబు ఎరుగుట గొప్ప గుణము అదే గొప్ప విద్య అని కూడా ఏఎ న్నార్ సర్ ఓ సందర్భంలో చెప్పేరు ఎంఎన్నార్ సర్..అవే మాటలు ఉటంకిస్తు న్నా కానీ ప్రకాశ్ రాజ్ ఒక మాట మన తెలుగు వెలుగుతోనే అన్నారు..ఉటం కింపులు అన్నవి ఉత్తమ సాహిత్యానికి ప్రతీకలు కావు అని..దీనిని మీరు పరిగ ణించాలి..ఆ సంపాదకీయం అను పేజీని పుంజెడు అక్షరాలనూ ఇంకా ఇంకొ న్నింటిని ప్రేమతో నింపేయండి..వాత్సల్యం ప్రకటించండి..ఇప్పటి ప్రేమను మ రింత రెట్టింపు చేయండి..
నా గురుతుల్యులు రావూరి భరద్వాజ ఓ సందర్భంలో ఇలా చెప్పేరు..ప్రతి వ్యక్తీకరణకూ తొలితనం, తాజాతనం అన్నవి కీలకం అ ని..అవును నేను చె బుతున్నాను ఈ మనుషులంతా గొంగళిని ప్రేమించలేకపోతున్నారు సీతాకోక దశను ఆహ్వానించలేకపోతున్నారు..కనుక మనుషులకు మాధ్యమాలకు హృ దయ గత పరిభాష అర్థం అయి చావదు..అందుకనో/ఎందుకనో ఈ మాధ్యమా లు ఆ పరిభాషకు ప్రాధాన్యం ఇవ్వడం మరిచిపోయాయి.
ఈనాడు..సైకిల్ తొక్కుతూ సోమాజిగూడ దారులలో నడయాడుతూ..ఆ కా ర్యాలయానికి చేరుకున్న రోజు గుర్తుంది..040- 23318181 అనే బోర్డ్ నంబర్ తో మాట్లాడిన రోజు గుర్తుంది..సీతమ్మ లోగిలిలో అంటూ మా పతంజలి సర్ మీ దగ్గర పనిచేసిన రోజులూ తెలుసు..మీ ముందు చాలా కాలం సంస్థ కు దిశా ని ర్దేశం చేసిన ఏబీకే కూడా ఏం రాయగలరో ఏం రాశారో చెప్పగలను..బూదరాజు చాదస్తాన్ని మాలాంటి వారి నెత్తిన రుద్దాలన్న తాపత్ర యంతో మీ నుంచి వ చ్చేసిన జర్నలిస్టులు ఆ రెండక్షరాల మాధ్యమంలో ఏ విధంగా హల్ చల్ చేశా రో చేస్తున్నారో చెప్పగలను..ఇంకా ఏవేవో/ఎన్నెన్నో..ఒక్కటే ఈరోజు ఈనాడు భాషలో కానీ వ్యక్తీకరణలో కానీ ఇంకా ఇంకా మార్పులు రావాలి అని కోరుకోవ డం తప్పు కాదనే అనుకుంటాను. వాక్యం ఎలా ఉండాలో ఈజేఎస్ హె చ్ఆర్ మేనేజర్ (ఆయనొక సోకాల్డ్ రైటర్ లేండి) బోధిస్తుంటే వినేంత స్థాయిలో కొన్ని సార్లు, లేని స్థాయిలో ఎ న్నో సార్లు ఉన్నాను. అయినప్పటికీ ఈ నాలుగు ప దుల సంస్థ సాధించిన విజయాలను స్మరిస్తూ ఇంకాస్త పరిణి తిని పొందాలనే అనుకుంటాను కానీ అయ్యో! వీళ్లంతా నా లాంటి వారికి ఇంకా ఇంకా ఏం నేర్ప లేకపోతున్నారే అని మాత్రం పాపా నికి కూడా అనుకోను..చెప్పాను కదా! నే ర్చుకోవడం అన్నది ఎవరికి వారు చేయాల్సిన ప్రక్రియ..
రాజమండ్రి కేంద్రంగా ఎప్పుడూ భాష సంబంధం అయిన తప్పిదాలు వస్తూనే ఉంటాయి..వాటినిచూసి నవ్వుకోవడం తప్ప ఏం చే యగలం..ప్రతీ రాతకూ ఓ చలన సూత్రం అన్వయింపజేయడం చేతగాని మాధ్యమాలు మన మధ్యే అనే కం ఉన్నాయి. కానీ ఈ నాడు రాత చలన సూత్రం కాదు కొన్నింట అదే చైత న్యం..కానీ ఆ స్థాయి అస్సలు ఇప్పుడు లేదు అనే చెబుతున్నాను..దానవ త్వం ఏంటి సర్..ఈ పదం ఉందా.. సర్వేజనా దుఃఖో భవంతు ఏంటి రైతు ఆవే దనను అక్షరీకరించే తీరేనా.,.దేశ రాజధానిలో ఆకలి చావులు మీకే ఎందుకు పట్టవు.. ఎందుకని మీరు ఇవాళ ఆ హృదయ గత భాష రాయలేకపోతున్నా రు. ఇవన్నీ ఆలోచించుకో వాలి మీరు..అలానే కృతక అనువాదాలకు స్వస్తి ప లికించాలి మీరు..గుండ్రని బల్ల సమావేశం ఈ పదం అస్సలు బాలేదు అండి..
ఇవన్నీ చదివితే రారా గుర్తుకువస్తారు..(రారా అంటే రాచముల్లు రామచంద్రా రెడ్డి అని) ఉదయం పత్రిక కోసం ప్రారంభ సంచిక సందర్భంగా ఏబీకే రాసిన వ్యాసాన్ని ధునుమాడిన తీరు ఒకటి తీరునొక్క ముల్లల్లే గుచ్చుకుంటుంది.. గుర్తుకువస్తుంది..
ఏటా ఈనాడు ట్రైనీలు మా శ్రీకాకుళంలో అగుపిస్తారు..ఆపి ఒక్కటే అడుగుతా ను..మీరు ఏం చదువుకున్నారు అని! ఒక స్ట్రింగర్ లైఫ్ మొదలుకుని మీ దగ్గర ఉన్న పర్వతం మూర్తి వరకూ ఎవరెవరు ఏం రాయగలరో అత్యంత సులువుగా చెబుతాను..అయ్యో! ఒక జ్ఞాన్ పీఠ్ అవార్డు గ్రహీత (రావూరి భరద్వాజ) గురిం చి మాట్లాడలేని అచేతనలో ఒక సబ్ ఎడిటర్ ఉన్నారా మీ దగ్గర అని బాధపడ తాను.. అయ్యో! కనీసం చదువుకోకుండా వారి గురించి తెలుసుకోకుండా 70 లలో పెద్దాయన కష్లం ఏంటన్నది తెలుసుకో కుండా వస్తున్నారే వీరంతా అని ఆవేదన చెందుతాను..నేను కోట్ల ప్రజలలో ఒకడ్ని పెద్దాయనకు వీరాభిమాని ని..నాలానే సైకిల్ తొక్కుతూ ఆ విశాఖ వీధుల్లో..నాలానే అత్యంత సామాన్య జీ వితంతో పెద్దాయన అని తప్పక చెప్పగలను.. వారే మాకు నిత్య స్ఫూర్తి.. కానీ ఇవాళ ఆ స్థాయిలో అసలు కట్టిపడేసే వాక్యం ఒక్కటి లేదు.. కనీసం ఇంట్రో కూ డా ఆశించిన రీతిలో రాయలేకపోతున్నా రు..బయట మాత్రం నేను ఈనాడు తె లుసా అని అంటూ కాలర్ ఎగరేస్తారు..సర్ ..నేను కార్మెల్ పాయింట్ నుంచి వ చ్చిన కుర్రా డ్ని..శ్రీకాకుళంవాసిని..అతి సామాన్యుడ్ని..నేను రెండక్షరాల మీడి యాలో కొద్ది రోజులు మాత్రమే ఉన్నాను.. నచ్చక మానేశాను.. కానీ ఫ్యామిలీ స్థాయిలో మన దగ్గర ఒక్కటంటే ఒక్క నెరేషన్ లేదు అని మాత్రం చెప్పగలను ..అయ్యో ! బ్లాక్ హ్యూమర్ రాయలే కపోతున్నారే అని కూడా చెప్పగలను.. సంపాదకీయం పేజీలో ఒకప్పటి వ్యంగ్యానికి ఇప్పటి వ్యంగ్యానికి ఎంతో తేడా! ఆ రాత అ స్సలస్సలు మాలాంటి వారు ఆశించిన స్థాయిలో లేదనే చెప్పగల ను. ఇంకా ఆ ఆదివారం అనుబంధంలో చెప్పుకోదగ్గ స్థాయిలో కథనాలు లేనే లేవు.. టోటల్ గా ఇవాళ పేపర్ నచ్చడం లేదు..నాలాంంటి అతి సామాన్యుడు కోరుకునేది కార్పొరేట్ శక్తుల గురించి రాసే రాతలు కావు కదా! మరెందుకని వా టికే ప్రాధాన్యం అంటే అందుకు తగ్గ కారణాలు కూడా చెప్పగలను..డిజిటల్ మాధ్యమాల్లో సైతం గొ ప్ప రాతలు వస్తున్నాయే ఆ ఆదివారం అనుబంధంలో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ సర్ గురువు గురిం చి అంత పేలవం గా రాశారేంటి..అని అనుకున్నాను..తరువాత మళ్లీ మళ్లీ నవ్వుకున్నాను..వే గంగా రాయడం వేగంగా రాసి ఫలి తాలు అందుకోవడం అనుకున్న పని అను కున్న సమయం కన్నా ముందే పూర్తి చేసి ఫలి తాలు అందివ్వడం అన్నవి నా వరకూ ఈనాడే నేర్పింది..మీ బ్రాంచి మేనేజర్ క్యాబిన్ లో ఓ సారి చదివే ను.. ఒక సేయింగ్..ఫెయిల్యూర్ పర్సన్స్ ఆర్ గివింగ్ రీజన్స్ సక్సెస్ ఫుల్ ప ర్సన్స్ ఆర్ గివింగ్ రిజల్ట్స్ అని.. మరి!ఆ స్థాయిలో పరుగులు ఎన్నడు వస్తా యో! ఓ పెద్దాయన అభిమానిగా సంస్థలో మరిన్ని మంచి మార్పులు ఆశిస్తు న్నాను.. రాత లేదు సరే! కనీసం ఆ ప్రయత్నం అయినా ఉం డాలి కదా అని మరోమారు విశ్వ సిస్తూ, లేనివాటి గురించి, అవి అత్యంత ప్రమాదకర శక్తుల కూటమిగా మారక మునుపే మీరంతా మేల్కొంటారని మళ్లీ మళ్లీ విశ్వసిస్తూ ..తొలి సంజెల్లో వినిపిస్తున్నానీ మార్నింగ్ రాగా..కొన్ని తారలు మళ్లీ,మళ్లీ జ న్మిస్తాయి కొన్ని తారలు మళ్లీ మళ్లీ వికసిస్తా యి..కొన్ని తారలు అభిఘాత ప రంపరను ప్రేమిస్తాయి..ఈ తార ధ్రువతార కావాలి..ఈ స్వరం తెలుగు వారి గుం డెలను మళ్లీ మళ్లీ కదిలించగలగాలి..తప్పులు తక్కువ చేసి ఒప్పులు ఎక్కువ చేసి ఆయన ఒప్పుల కుప్ప కావాలి..ఇది కదా కోరుకుంటున్నా మీ నుంచి.. వాఃడికేం కోడెలాగ ఉన్నాడు..హా..పత్రిక కూడా అలాంటిదే సంపాదక స్థానం కూ డా అలాంటిదే.. మీ నాన్నగారి మాటలతోనే ఈ మార్నింగ్ రాగాకు ఇస్తున్నా నొక ముగింపు..మీకో ధన్యవాద/మీకో కృతజ్ఞత..
బాగా చదువుకుని రమ్మని చెప్పండి ఇప్పటి పాత్రికేయులకు..అలా లేని రోజు న నేను రాస్తూనే ఉంటాను..ఇంకా కోపం వస్తే తిట్టే స్తాను కూడా.. చెప్పాను క దా అది నా సంస్థ మీరు పనిచేస్తున్నారంతే! పెద్దాయనా! ఏమంటారు..నేనూ మీలానే సైకిల్ తొక్కుతూ జీవితాన్నీ, ప్రపంచాన్నీ, ప్రాపంచిక జ్ఞానాన్నీ ప్రేమి స్తున్నవాణ్ని..ఎంఎన్నార్ సర్ ఉంటానిక.అనేకానేక ఆలోచనల పరంపరలో..