రాజ‌శేఖ‌ర్ సింగిల్ టేక్

 Telugu Hero Rajashekar single take
‘పి.ఎస్.వి.గరుడవేగ’  తర్వాత రాజశేఖర్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘కల్కి’. 1983 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న క్రైమ్ థ్రిల్లర్ ఇది. ‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా యాక్షన్ పార్ట్‌ను రీసెంట్‌గా తెరకెక్కించారట. ఆసక్తికర‌మైన విషయవేుమంటే హీరో రాజశేఖర్ ఇందులో ఏడు నిమిషాల పాటు ఉండే యాక్షన్ సీన్‌ను సింగిల్ షాట్‌లో.. సింగిల్ టేక్‌లో పూర్తి చేసేశారట. ఇంత పెద్ద యాక్షన్ సీక్వెన్స్‌ను సింగిల్ షాట్‌లో చేయడం చాలా గొప్ప విషయుమని యూనిట్ సభ్యులు అంటున్నారు. రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. శివానీ శివాత్మిక మూవీస్ బ్యానర్ సమర్పణలో హ్యపీ మూవీస్ పతాకంపై రూపొందనున్న ఈ చిత్రానికి సి.కల్యాణ్, శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ నిర్మాతలు.  ఈ చిత్రంలో ఆదాశర్మ, నందితాశ్వేత, స్కార్లెట్ విలన్స్ హీరోయిన్లుగా సందడి చేయనున్నారు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article