మార్చి నుండి `96` తెలుగు రీమేక్‌

“96” telugu remake starts from March
ఈ ఏడాది సంక్రాంతికి `ఎఫ్ 2.. ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్‌`తో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ను సాధించిన నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ త‌మ బ్యాన‌ర్‌లో 34వ సినిమాకు శ్రీకారం చుట్ట‌నుంది. ఇది వ‌ర‌కు సామాజిక మాధ్య‌మాల్లో విన‌ప‌డుతున్న‌ట్లుగా త‌మిళ చిత్రం `96` రీమేక్‌కు రంగం సిద్ధ‌మైంది. శ‌ర్వానంద్‌, స‌మంత న‌టించ‌డం ఖాయ‌మైంది. అధికారిక స‌మాచారం రావాల్సి ఉంది.  త‌మిళంలో విజ‌య్ సేతుప‌తి, త్రిష న‌టించి ఘ‌న విజ‌యం సాధించిన చిత్రం `96` చిత్రాన్ని డైరెక్ట్ చేసిన సి.ప్రేమ‌కుమార్ తెలుగు రీమేక్‌ను కూడా తెర‌కెక్కించ‌బోతున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. మార్చి నుండి సినిమా చిత్రీక‌ర‌ణ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో న‌టించ‌బోయే న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తార‌ని స‌మాచారం.
More Telugu news
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article