తెలుగురాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల మార్పు?

telugu states bjp leaders will change?
ఏపీ, తెలంగాణా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీలో మార్పులు జరగనున్నాయి. త్వరలోనే ఏపీ తెలంగాణలకు  బీజేపీ కొత్త అధ్యక్షులు రాబోతున్నారని ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని విద్యాసాగర్ రావు వ్యాఖ్యలు చెయ్యటం  తెలంగాణతోపాటు ఆంధ్రా బీజేపీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
దీంతో ప్రస్తుతం ఉన్న లక్ష్మణ్, కన్నా లక్ష్మీనారాయణల మార్పు ఖాయం అన్న ప్రచారం సాగుతోంది. రెండు రాష్ట్రాలకు కొత్త వారిని తీసుకుంటే వారు ఎవరు అనే ఆసక్తి నేతల్లో వ్యక్తమవుతోంది. బీజేపీ నేతల్లోనూ గందరగోళం సృష్టించింది.ఈ నేపథ్యంలోనే తాజాగా శుక్రవారం విద్యాసాగర్ రావు ఫ్లేట్ ఫిరాయించారు. రాష్ట్ర అధ్యక్షులను నియమించేది తాను కాదని.. జాతీయ నాయకత్వం చూసుకుంటుందని విద్యాసాగర్ రావు దాటవేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో తాను లేనని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న వారిని కూడా కొనసాగించవచ్చు అని పార్టీలో రేగిన అసమ్మతిని చల్లార్చారు.  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాత్రం విద్యాసాగర్ రావు వ్యాఖ్యలను లైట్ గా తీసుకున్నారు.మహారాష్ట్ర గవర్నర్ గా దిగిపోయాక తెలంగాణ బీజేపీ పగ్గాలను విద్యాసాగర్ రావు చేపడుతారని చర్చ జరిగింది. బీజేపీ ఈయననే కేసీఆర్ పై తురుపుముక్కగా దించుతుందని భావించారు. కేసీఆర్ సామాజిక వర్గానికే చెందిన విద్యాసాగర్ రావు అయితే ధీటుగా జవాబివ్వగలడని యోచిస్తోంది.ఇక ఈ క్రమంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తుంది.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article