నీటి పంపకాలపై తెలుగురాష్ట్రాల ఇంజినీర్లు భేటీ

94
About Andhra Pradesh And telangana Chief Ministers
About Andhra Pradesh And telangana Chief Ministers
Telugu States engineers meet for water supply

ఏపీ తెలంగాణా రాష్ట్రాల సీఎం లు కలిసి కట్టుగా ఇరు రాష్ట్రాలను అభివృద్ధి చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఎప్పటి నుండో వున్న జలవివాదాలను సైతం పరిష్కరించుకునే పనిలో పడ్డారు. ఇక ఈ నేపధ్యంలోనే నీటి పంపకాలపై ఏపీ, తెలంగాణ ఇంజినీర్ల సమావేశం అయ్యారు. పోతిరెడ్డిపాడు, కేసీ కెనాల్, ఎన్సీపీ లెఫ్ట్ కెనాల్, కేడీఎస్‌ నుంచి.. కేటాయింపుల కంటే ఎక్కువ నీటిని వాడుకున్నారని తెలంగాణ వాదించింది. ఎన్సీపీ లెఫ్ట్ కెనాల్ మినహా మిగతా ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ వాదనతో ఏపీ ఇరిగేషన్ అధికారులు ఏకీభవించారు. ఈ నెల 15న ఈఎన్‌సీల సమావేశంలో చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ వరకు 150 టీఎంసీల నీరు విడుదల చేయాలని ఏపీ కోరింది. అలాగే 79 టీఎంసీల నీరు విడుదల చేయాలని తెలంగాణ కోరింది. రేపు నీటి కేటాయింపులపై రిలీజ్ ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.మొత్తానికి గత ప్రభుత్వం ఉన్న సమయంలో ఘర్షణలు తప్ప సమస్య సానుకూలంగా పరిష్కరించుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు సమస్య పరిష్కారానికి ఇఋ రాష్ట్రాలు ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్తున్నాయి.

tags : ap, telangana, water sources, river water controversies, engineers meeting

ఈసారి సింగరేణిలో ఎవరిది హవా?

కేసీఆర్ బాటలో జగన్.. ఏ విషయంలో తెలుసా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here