Telugu Students facing lot of Problems in America ఒక్కో సెల్ లో ౩౦ మంది ..
అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్న అమెరికా అధికారుల కబంద హస్తాల్లో తెలుగు విద్యార్థులు చిక్కుకున్నారు. డాలర్ డ్రీమ్స్ నిజం చేసుకోవాలని అమెరికా వెళ్లిన తెలుగువారు చిక్కుల్లో పడ్డారు. అడ్డదారులు తొక్కయినా సరే అక్కడే ఉండిపోవాలని ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యారు. . దీంతో విద్యార్థులు జైళ్లలో మగ్గుతున్నారు.అమెరికా అధికారుల అండర్ కవర్ ఆపరేషన్‌లో అరెస్టు అయ్యి జైలులో ఉన్న తెలుగు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 121 మంది తెలుగు విద్యార్థులను అమెరికా నుంచి తిప్పి పంపివేయటానికి ఇమిగ్రేషన్ అధికారులు కేసులు పెట్టారు. వీరంతా యూఎస్‌లోని పలు రాష్ట్రాలకు చెందినవారు. డెట్రాయిట్‌లో ఎక్కువగా 29 మందిని, న్యూయార్క్‌లో 30 మందిని అరెస్టు చేశారని తెలుస్తోంది.
డెట్రాయిట్‌లోని జైలులో ఉన్న ఒక విద్యార్థి ఫోన్‌లో తమ దీనగాథను వివరించడం అక్కడి తెలుగు విద్యార్థుల ఇబ్బందులు వెలుగులోకి వచ్చాయి. వీరిని కుల్హన్ కౌంటీ జైలులో నిర్బంధించారు. ఒక సెల్‌లో మొత్తం 30 మందిని ఉంచారు. ఇంకో సెల్‌లో తెలుగు అమ్మాయిని ఒక అమెరికన్‌తో కలిపి ఉంచారు. బయట వాళ్లతో మాట్లాడటానికి రోజుకు ఒకసారి మాత్రమే అనుమతిస్తున్నారు. దీంతో అక్కడి జైల్ లో తెలుగు విద్యార్థులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. విద్యార్థులు బెయిల్ కోసం ప్రయత్నించిన బెయిల్ రాదని అటార్నీ తెలిపింది. తమకు ఇండియన్ ఎంబసీ అధికారులే సాయం చేయాలని విద్యార్ధులు కోరుతున్నారు. వారి విషయంలో భారత ప్రభుత్వం కల్పించుకోవాలని. వెంటనే తమ పిల్లలను రక్షణ కల్పించాలని వారి పేరెంట్స్ కోరుతున్నారు.