TELUGU STUDENTS FREE IN USA – నకిలీ వీసాల కేసు..
అమెరికాలో నకిలీ వీసాల కేసులో…. అరెస్టైన తెలుగు విద్యార్ధులకు విముక్తి లభించింది. కోర్టు విచారణ తర్వాత వారు స్వదేశానికి తిరిగిరానున్నారు. ప్రస్తుత డౌన్టౌన్ డెట్రాయిట్ కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసులో అరెస్టై అక్కడి జైళ్లలో ఉన్న 20 మందిలో ఇప్పటికే ముగ్గురు విద్యార్థులకు విముక్తి లభించింది. ఫిబ్రవరి 26 లోపు అమెరికా నుంచి ఇండియా వెళ్లిపోయేందుకు మరో 15 మందికి కోర్టు అనుమతిచ్చింది. కోర్టు నుంచి తుది ఆదేశాలు రాగానే… వారంతా ఇండియాకు రానున్నారు.
17 మంది విద్యార్ధుల్లో 8 మంది మిన్రో డిటెన్షన్ సెంటర్‌లో ఉన్నారు. మరో 9 మంది కల్హౌన్ కౌంటిలో ఉన్నారు. మిషిగాన్ డిటెన్షన్ సెంటర్లో ముగ్గురు విద్యార్ధులు విడుదలయ్యారని అమెరికన్ తెలుగు అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఇవాళ మరో 18 మందికి బెయిల్ దొరికే అవకాశం ఉందని.. ఈ విషయంలో చొరవ చూపిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ బృందం.. అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు ఎలిసా స్లాట్‌ను కలిసింది.నకిలీ వీసాల కేసులో…. అరెస్టైన తెలుగు విద్యార్ధులకు విముక్తి లభించే దాకా తమ వంతు ప్రయత్నం చేస్తామని “ఆటా” బృందం ప్రకటించింది.
For More Click Here