రాజధానిలో ఉద్రిక్తత…సిఐ , ఎస్సైలకు గాయాలు

Tension grips Amaravati as farmers continue protest

ఏపీ రాజధాని అమరావతి అట్టుడుకుతోంది.సీఎం జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటనతో అమరావతి రైతులు పోరుబాట పట్టారు. రాజధాని మార్పును తీవ్రంగా వ్యతిరేకిస్తూ గత కొన్నిరోజులుగా ఇక్కడి రైతులు, వారి కుటుంబసభ్యులు నిరసనలు, ధర్నాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. తాజగా నేడు క్యాబినెట్ భేటీ సందర్భంగా సీఎం జగన్ రాజధాని విషయంలో తుది నిర్ణయం ప్రకటిస్తారని భావిస్తే తాజా పరిణామాల దృష్ట్యా ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించటం వాయిదా వేసినట్టు తెలుస్తుంది. అయినా రాజధాని అమరావతి కోసం రైతులు చాలా ఉధృతంగా పోరాటాలు చేస్తున్నారు. ఈ రోజు  వెలగపూడిలో నిర్వహిస్తున్న రైతుల దీక్ష ఉద్రిక్తంగా మారింది. రైతులు ఆందోళన చేస్తుండగా, అక్కడికి వచ్చిన ఓ వాహనాన్ని రాజధాని మహిళలు చుట్టుముట్టి ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇద్దరు పోలీసు అధికారులకు గాయాలయ్యాయి. మహిళలను, ఇతర ఆందోళనకారులను అడ్డుకునేందుకు యత్నించిన ఓ సీఐ, ఎస్సై గాయపడ్డారు. తాము చేసిన త్యాగాలకు విలువ ఇవ్వకుండా రాజధానిని మార్చుతారా? అంటూ మహిళలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. పోలీసులపై విరుచుకుపడ్డారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article