కాకినాడ పవన్ పర్యటన .. అడుగడుగునా టెన్షన్

130
Tension grips as Pawan Kalyan
Tension grips as Pawan Kalyan

Tension grips as Pawan Kalyan reaches Kakinada

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు  తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు వెళ్ళారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటన టెన్షన్ టెన్షన్‌గా మారింది.  విశాఖ నుంచి కాకినాడకు చేరుకున్న పవన్.. జనసేన పార్టీ నాయకుడు నానాజీతో ఆయన ఇంటిలో సమావేశమయ్యారు.  పవన్  వెంట భారీగా కార్యకర్తలు ఉండటంతో తుని, ప్రత్తిపాడు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి, ప్రధాన రహదారులను మూసివేశారు పోలీసులు. తునిలో పది వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు రహదారులను మూసి వేయడంతో.. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక అటు నానాజీ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించి ఉన్నారు. ఇక ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా  కాకినాడలో ప్రస్తుతం 144 సెక్షన్ అమలవుతోంది. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంటి వద్ద కూడా పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. పవన్‌పై వైసీపీ ఎమ్మెల్యే ద్వారం పూడి చంద్రశేఖర్.. షాకింగ్ కామెంట్స్ చేయడంతో.. ఆదివారం ఆయన ఇంటిని, జనసేన కార్యకర్తలు ముట్టడించిన విషయం తెలిసిందే .ఈ నేపథ్యంలో కాకినాడలో పవన్ పర్యటన ఉద్రిక్త వాతావరణాన్ని నింపింది. కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ పై చేసిన అసభ్య వ్యాఖ్యల నేపధ్యంలో  ఆయన ఇంటికి వెళ్ళటానికి ప్రయత్నించిన పవన్ పార్టీ కార్యకర్తలను , ద్వారంపూడి అనుచరులు దాడి చేసి గాయపరిచారు. అక్కడ జరిగిన రాళ్ళ దాడిలో గాయపడిన జనసేన కార్యకర్తలను పవన్ పరామర్శించారు . వారి ఆరోగ్య పరిస్థితి గురించి పవన్ ఆరా తీస్తున్నారు . పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నారు.

Tension grips as Pawan Kalyan reaches Kakinada,andhra pradesh, pawan kalyan, janasena ,dwarampudi chandrasekhar, ycp , attack , police cases ,  kakinada, pavan , console , victims ,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here