రాజధాని కోసం నలుగురు యువకులు..హై టెన్షన్

110
Tension in Thullur
Tension in Thullur

Tension in Thullur as four youth climb cellphone tower

ఏపీలో రాజధాని అమరావతి కోసం ఆందోళనలు కొనసాగుతున్నాయి.  ఇప్పటికి 32 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం మాత్రం మూడు రాజధానుల నిర్ణయానికే కట్టుబడినట్టు తెలుస్తుంది . ఇక రాజధాని అమరావతిని తరలించాలని ప్రభుత్వం పనులు చేస్తున్న నేపధ్యంలో రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా తుళ్లూరులో నలుగురు యువకులు సెల్‌ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. సెల్‌ టవర్‌ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటామని నినాదాలు చేశారు. ఎమ్మెల్యే శ్రీదేవి రావాలని, రాజధాని అమరావతిపై హామీ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ఇక మరోపక్క మందడం, వెలగపూడి గ్రామాల్లో రైతులు నిరాహార దీక్షలు చేపట్టారు. అలాగే గుంటూరు జిల్లా తాడికొండ అడ్డరోడ్డులో నిరాహారదీక్షలు జరుగుతున్నాయి. ఇటు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తుళ్లూరు, మందడం గ్రామాల్లో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. దీంతో రాజధాని ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Tension in Thullur as four youth climb cellphone tower,Andhrapradesh ,AP CM Jagan mohan reddy , amaravati, three capitals, capital farmers,tulluru youth , cell tower, suicide threaten, tension

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here