క్యాపిటల్ వార్ ..

116
Tension prevails at Madadam in Amaravati
Tension prevails at Madadam in Amaravati

Tension prevails at Madadam in Amaravati

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా  అమరావతినే కొనసాగించాలని ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధాని అమరావతి  విషయంలో రైతులు చేపట్టినటువంటి ఆందోళనలు నేడు మరింత ఉదృతంగా మారాయి.  సకల జనుల సమ్మెకు పిలుపునిచ్చిన రైతులు ఈరోజు ఆందోళనలను తీవ్రతరం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఈ ఆందోళనలు నేడు సకల జనుల సమ్మె గా మార్చారు రైతులు. అయితే అమరావతిలోని మందడంలో ఆందోళన చేస్తున్నటువంటి మహిళల్ని  పోలీసులు అరెస్టు చేశారు. అయితే పోలీసులు ప్రవర్తిస్తున్న తీరుపై ఆందోళన చేస్తున్న రైతులందరూ కూడా తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తమపై పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో అక్కడ పరిస్తితు ఉద్రిక్తంగా మారింది. మహిళలకు ఒలీసులకు మధ్య వాగ్వాదం కొనసాగింది. ఒక మహిళా స్పృహ కోల్పోయారు. అయితే రాజధాని ప్రాంతంలోని 29 ప్రాంతాల ప్రజలు, రైతులు అందరు కూడా తమకు న్యాయం చేయాలనీ ఆందోళనలను పెంచుతూ… మోకాళ్లపై నిల్చొని నిరసనలను తీవ్రస్థాయిలో ఉదృతం చేశారు. ఈ నేపథ్యంలో మందడంలో ర్యాలీ నిర్వహిస్తున్న మహిళలను పోలీసులు అడ్డుకున్నారు.అయితే శాంతి భద్రతల దృష్ట్యా కొందరు మహిళలను అరెస్టు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే గత 16 రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా పట్టించుకోని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడుపోలీసులని పంపించి తమను అడ్డుకోవాలని చూస్తే మాత్రం తమ సకల జనుల సమ్మెని మరింత ఉదృతం చేస్తామని అక్కడి మహిళలు, రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.

Tension prevails at Madadam in Amaravati,capital, amaravati, andhrapradesh, capital farmers, mandadam ,police, women, arrest ,Amaravati Women Protest

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here