తెలంగాణా కాంగ్రెస్ లో టెన్షన్

Tension in Telangana Congress

సీఎల్పీ నేత ఎంపిక నేడే

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీఎల్పీ నేతగా తమకు అవకాశం ఇవ్వాలంటూ ముందస్తు ఎన్నికల్లో గెలిచిన చాలా మంది ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. ప్రతిపక్ష పార్టీలో ఉండి అధికార పార్టీ ఒత్తిడిని తట్టుకోవాలంటే సీఎల్పీ నేతగా ఉంటే దీటుగా ఎదుర్కోవచ్చు అన్న భావనను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు. అందుకే సీఎల్పీ నేత ఎంపిక వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో వాతావరణాన్ని వేడెక్కిస్తుంది.
సీఎల్పీ నేత ఎంపికపై కాంగ్రెస్‌లో ఉత్కంఠ కొనసాగుతోంది. ఢిల్లీ నుంచి వచ్చిన ఏఐసీసీ పరిశీలకుడు వేణుగోపాల్‌ నేతృత్వంలో సీఎల్పీ నేత ఎవరన్నది తేల్చనున్నారు. అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో సమావేశమైన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సీఎల్పీ నేతను ఎన్నుకోనున్నారు. సీఎల్పీ నేత ఎంపిక ఏఐసీసీ పరిశీలకుడు వేణుగోపాల్‌ ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలు సేకరించారు. సీఎల్పీ లీడర్‌ ఎంపికపై అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. అయితే, సీఎల్పీగా తనకు ఛాన్స్‌ ఇవ్వాలని సుధీర్‌ రెడ్డి పట్టుబట్టడంతో సీఎల్పీ సమావేశం వేడెక్కింది. పార్టీలో ఉన్న ఉపాధ్యక్షులు, కీలక పదవుల్లో ఉన్నవారికి తమ కుటుంబ సభ్యులు కూడా ఓట్లేయలేదని సుధీర్‌ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం పని చేసే వారికే సీఎల్పీ నేతగా అవకాశం ఇవ్వాలని కోరారు.
ఇక ప్రతిపక్ష నేత హోదా కోసం కాంగ్రెస్‌ సీనియర్లు పోటీ పడుతున్నారు. సీనియర్ నేతలుగా ఉన్న ఉత్తమ్, భట్టి విక్రమార్క, సబితా ఇంద్రారెడ్డితో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు సీఎల్పీ నేత కోసం రేసులో ఉన్నారు. అయితే మెజార్టీ ఎమ్మెల్యేలు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ వైపే ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అధిష్టానం ఉత్తమ్ ను సీఎల్పీ నేతగా ఎంపిక చేస్తే కొన్నాళ్ల పాటు పీసీసీ అధ్యక్షునిగా కూడా కొనసాగించి, తర్వాత ఈ పదవిని భట్టికి అప్పగిస్తారనే చర్చ జరుగుతోంది. ఇక కుల సమీకరణాల కోణంలో భట్టిని సీఎల్పీ నేతగా చేస్తే.. ఉత్తమ్ టీపీసీసీ అధ్యక్ష పదవిలో కొనసాగే అవకాశం ఉంది. అయితే తనకు పీసీసీ సాధ్యం కాని పక్షంలో ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని శ్రీధర్ బాబు కోరుతున్నట్టు సమాచారం. ఇక మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా సీఎల్పీ పదవి కోరుకుంటున్నారు. చూడాలి మరి సీఎల్పీ నేతగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎవరికి అవకాశం ఇస్తుందో

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article