మోతుగూడెం వద్ద రోడ్డు ప్రమాదం ఒక‌రు మృతి

అల్లూరి సీతారామ‌రాజు జిల్లా మోతుగూడెం వ‌ద్ద జ‌రిగిన ర‌హ‌దారి ప్ర‌మాదంలో లారీ డ్రైవ‌ర్ మృతి చెంద‌గా,
సీలేరు నుంచి విజయవాడ వెళ్తున్న బస్సు ఎదురుగా వ‌స్తున్న లారీ ని ఢీకొన్న సంఘ‌ట‌న‌లో ఒక‌రు మృతి చెంద‌గా, 15 మందికి గాయాల‌య్యాయి. గురువారం ఉద‌యం సీలేరు నుంచి బ‌య‌లుదేరిన విజ‌య‌వాడ బ‌స్సు ను తూలుకొండ వ‌ద్ద‌కు వ‌చ్చేస‌రికి భద్రాచలం నుంచి వస్తున్న సిమెంట్ లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సిమెంట్ లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా… బస్సులో ఉన్న డ్రైవ‌ర్‌తో బాటు 15 మంది ప్రయాణికులకు గాయాల‌య్యాయి. గాయ‌ప‌డిన వారికి హుటాహుటిన చింతూరుకు త‌ర‌లించారు. అక్క‌డ ప్ర‌థ‌మ చికిత్స చేయించి మెరుగైన వైద్య సేవ‌లు కోసం భ‌ద్రాచ‌లం త‌ర‌లించారు. బ‌స్సు డ్రైవ‌ర్ శ్రీనుకు రెండు కాళ్లు విరిగిపోగా, మ‌రికొంత‌మందికి త‌ల‌కు గాయాల‌య్యాయి.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article