కాశ్మీర్ లో ఉగ్ర దాడి

127
Change of Terrorist law Approved
Change of Terrorist law Approved

terrorist in Kashmir .. 15కు చేరిన జవాన్ల మృతుల సంఖ్య

కాశ్మీర్ ఉగ్రవాదుల దుశ్చర్యతో ఉలిక్కిపడింది. శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్ జాతీయ రహదారి రక్తమోడింది. దేశం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి బోర్డర్ లో పనిచేస్తున్న జవాన్ల ప్రాణాలు ఉగ్రదాడిలో గాలిలో కలిసిపోయాయి.
ఉగ్రవాదులు జరిపిన ఐఈడీ బ్లాస్ట్ లో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్ల సంఖ్య 15కు చేరుకొంది.గురువారం(ఫిబ్రవరి-14,2019) మధ్యాహ్నం శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై పుల్వామా జిల్లాలోని అవంతిపురా టౌన్ దగ్గర్లోని గొరిపురా ఏరియాలో జైషే ఈ మహమద్ ఉగ్రసంస్థ సీఆర్ఫీఎఫ్ కాన్వాయ్ లోని బస్సు టార్గెట్ గా ఈ దాడికి పాల్పడింది.
ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 35 మంది జవాన్లు ఉన్నారు. క్షతగాత్రులను అధికారులు స్థానిక హాస్పిటల్ కు తరలించారు.15 మంది జవాన్ల పరిస్థితి విషయంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఐఈడీ బ్లాస్ట్ తో ఆ ఏరియా అంతా భీకర వాతావరణం నెలకొంది. బ్లాస్ట్ తర్వాత కూడా జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఉగ్రవాదులకు, భద్రత బలగాలకు మధ్య ఎన్ కౌంటర్ కొనసాగుతోంది.

For More Click Here

More Latest Interesting news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here