terrorist made adil video.. వీడియో చూసేసరికి స్వర్గంలో ఉంటా
చాపకింద నీరులా ఉగ్రవాదం విస్తరిస్తోంది. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకలించటానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆ ప్రయత్నాలు సఫలీకృతం కావడం లేదు అని చెప్పడానికి తాజాగా జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి ఒక ఉదాహరణ. భారతదేశంలోని ప్రజలలో విషబీజాలు నాటుతూ వారిని భారత దేశానికి వ్యతిరేకంగా పని చేసేలా, భారత దేశ రక్షణ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా పనిచేసేలా ఉగ్రవాద సంస్థలు తర్ఫీదు నిస్తున్నాయి . అంతేకాదు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆత్మాహుతి దాడులకు పాల్పడే లా వారిని పురికొల్పుతున్నాయి.
తాజాగా జమ్మూకాశ్మీర్లో జరిగిన దారుణ మారణకాండను చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఈ ఘటనకు పాల్పడినఅదిల్ అహ్మద్ పుల్వామా ప్రాంతానికి చెందిన వ్యక్తి.. 2016, మార్చి 19 నుంచి అదిల్‌తో పాటు అతడి ఇద్దరు స్నేహితులు టౌసిఫ్, వసీమ్ కనిపించడం లేదని అక్కడి పోలీసులు తెలిపారు. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో 42 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాది చివరి వీడియోను జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ విడుదల చేసింది. దాడికి పాల్పడిన ముష్కరుడు అదిల్ అహ్మద్.. సదరు వీడియోలో జైషే సంస్థ జెండా ముందు అదిల్ ఆటోమెటిక్ రైఫిల్స్‌ను తగిలించుకుని కనిపిస్తాడు.
‘‘ ఈ వీడియో మీరు చూసేసరికి… తాను స్వర్గంలో ఉంటానని… జైషేలే మిలిటెంట్‌గా ఏడాది పాటు ఉన్నానని, కశ్మీరీ ప్రజలకు తానిచ్చే చివరి సందేశం ఇదేనన్నాడు. దక్షిణ కశ్మీర్ ప్రజలు భారత్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని, ఇక ఉత్తర, మధ్య కశ్మీరీలతో పాటు జమ్ము ప్రజలు కూడా తమతో చేరాల్సిన సమయం వచ్చిందని జనానికి పిలుపునిచ్చాడు.
అలాగే తమ సంస్థకు చెందిన ఉగ్రవాదులను కొంతమందిని చంపినంత మాత్రాన తాము బలహీనపడిపోతామని అనుకోవద్దని’’ అదిల్ హెచ్చరిస్తున్నట్లుగా ఈ వీడియోలో ఉంది.
For More Click Here