టీజీ వెంకటేష్ వ్యాఖ్యలపై బాబు

TG Venkatesh Comments JanaSena and TDP – పవన్ ఫైర్

టీడీపీ పార్టీ రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా టీడీపీ-జనసేనలు కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. దీంతో చంద్రబాబు–పవన్‌ల రహస్య స్నేహం మరోసారి బయటపడింది. బుధవారం టీజీ వెంకటేశ్‌ మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ-జనసేనల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు.అంతేకాకుండా ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ-బీఎస్పీ కలిసినప్పుడు టీడీపీ-జనసేన కలిస్తే తప్పేంటని పొంతనలేని వ్యాఖ్యలు చేశారు. మార్చి నెలలో సీట్ల సర్దుబాటుపై చర్చలు ఉంటాయని, టీడీపీ-జనసేనలు కలిసేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పారు.సీఎం చంద్రబాబును కలిసి వచ్చిన తరువాతే వెంకటేశ్‌ ఈ వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ-జనసేనల మధ్య పొత్తు చర్చలు జరుగుతున్నాయా అని బయట జోరుగా చర్చ జరుగుతుంది.

ఇక టీడీపీ, జనసేన పొత్తు గురించి వ్యాఖ్యలు చేసిన ఎంపీ టీజీ వెంకటేష్ ‌పై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. పార్టీ విధానాలపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. అనవసరపు వ్యాఖ్యలతో పార్టీ శ్రేణుల్ని అయోమయానికి గురిచేయవద్దని ఆదేశించారు. టీడీపీ, జనసేన కలిస్తే తప్పేంటని ఈ ఉదయం టీజీ వెంకటేష్ వ్యాఖ్యానించడాన్ని చంద్రబాబు తప్పు పట్టారు. పార్టీ విధానాలపై వ్యాఖ్యలు చేసేటప్పుడు సయమనం పాటించాలని ఆదేశించిన చంద్రబాబు ఎన్నికల తరుణంలో ఇలాంటి కామెంట్లతో తీవ్ర గందరగోళం సృష్టిస్తే ఎవరికీ మంచిది కాదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. టీజీ వ్యాఖ్యలపై జనసేన నేత అధినేత పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లడవద్దని పెద్దరికం నిలబెట్టుకోవాలని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనికిమాలిన మాటలు మానుకొని పనికొచ్చే మాటాలు మాట్లాడితే బెటర్ అని పవన్ కళ్యాణ్ అన్నారు. టీజీ వెంటేష్ పిచ్చి పిచ్చే ప్రేలాపనలు మానుకోవాలని హెచ్చరించారు. మేం వదిలేసిన రాజ్యసభ సీటు దక్కించుకున్నారని విమర్శించారు పవన్ కళ్యాణ్.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article