త‌మ‌న్నా స్పెష‌ల్ సాంగ్‌?

Thamanna Special Song

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఇప్పుడు క్వీన్ రీమేక్ తెలుగు వెర్ష‌న్ `ద‌టీజ్ మ‌హాల‌క్ష్మి`తో సంద‌డి చేయ‌నుంది. కాగా.. ఆది సాయికుమార్ చిత్రంలో స్పెష‌ల్ సాంగ్ చేయ‌నుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఆది సాయికుమార్ ప్ర‌స్తుతం రెండు చిత్రాలు చేస్తున్నారు. అందులో ఒకటి సాయికిర‌ణ్ అడివి ద‌ర్శ‌క‌త్వంలో `ఆప‌రేష‌న్ గోల్డ్ ఫిష్‌` కాగా.. మ‌రో చిత్రం `బుర్ర‌క‌థ‌`. ర‌చ‌యిత డైమండ్ ర‌త్న‌బాబు తెర‌కెక్కిస్తోన్నఈ సినిమాలో ఓ స్పెష‌ల్ సాంగ్‌లో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా న‌టిస్తుంద‌ని టాక్‌. మ‌రి స్పెష‌ల్ సాంగ్ కాబ‌ట్టి త‌మ‌న్నా భారీగానే డిమాండ్ చేసుంటుంద‌న‌డంలో సందేహం లేదు. దీపాల ఆర్ట్స్ బ్యానర్ పై శ్రీకాంత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయికార్తీక్ సంగీతం అందిస్తున్నారు.

For More Click Here

More Latest Interesting news
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article