ఛాతీ మ‌ధ్యలో అతి పెద్ద క‌ణితి

ఛాతీ మ‌ధ్యలో అతి పెద్ద క‌ణితి

  • విజ‌యంవంతంగా తొల‌గించిన కిమ్స్ వైద్యులు
  • రాజ‌మండ్రి వాసికి కిమ్స్ సికింద్రాబాద్‌లో ఆధునాత‌న శ‌స్త్ర‌చికిత్స‌

హైదారాబాద్‌, జ‌న‌వ‌రి:
ఛాతీ మ‌ధ్య‌లో పెరిగిన అతి పెద్ద క‌ణితిని విజ‌య‌వంతంగా తొల‌గించారు కిమ్స్ సికింద్రాబాద్ వైద్యులు. రాజమ‌హేంద్ర‌వ‌రం ప్రాంతానికి చెందిన వ్య‌క్తికి అరుదైన శ‌స్త్ర‌చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. ఛాతీ మ‌ధ్య‌లో పెర‌గిన క‌ణితి, చికిత్స చేసిన విధానాన్ని సికింద్రాబాద్ కిమ్స్ ఆసుప‌త్రికి చెందిన స‌ర్జిక‌ల్ ఆంకాల‌జిస్ట్‌లు డాక్ట‌ర్‌. డి. రాము, డాక్ట‌ర్‌. అజ‌య్ చాణుక్య‌లు మీడియాకు వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

” తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌మ‌హేంద్ర‌వ‌రం (రాజ‌మండ్రి) ప్రాంతానికి చెందిన చ‌క్ర‌వ‌ర్తి (35) వృతిరీత్యా ఓ ప్రైవేట్ కంపెనీలు విధులు నిర్వ‌హిస్తున్నాడు. అత‌నికి శ్వాస స‌రిగా అందడంలేద‌ని అక్క‌డి స‌మీప వైద్యుల‌ను సంప్ర‌దించి టీబీ వ్యాధి అని నిర్ధారించుకొని చికిత్స తీసుకున్నాడు. రోజు రోజుకి స‌మ‌స్య తీవ్రమైంది. రెండు నెల‌లుగా శ్వాస తీసుకోవ‌డంలో తీవ్ర‌మైన ఇబ్బంది ప‌డ్డాడు. ఇర‌వై అడుగులు వేస్తే ఆయాసం వ‌చ్చేది. దీంతో ప‌రిస్థితి ద‌య‌నీయంగా తయారుకావ‌డంతో సికింద్రాబాద్ కిమ్స్ ఆసుప‌త్రికి వచ్చారు.

ఇక్క‌డికి వ‌చ్చిన త‌రువాత సిటీ స్కాన్ చేశాం. ఈ స్కానింగ్‌లో విస్తురుపోయో అంశాన్ని గుర్తించాం. ఛాతీ మ‌ధ్య‌లో కుడి ఊపిరితిత్తి వైపు దాదాపు 25 సెంటీమీట‌ర్ల పైగా ట్యూమ‌ర్ (క‌ణితి) ఉంది. దీంతో అత‌ని శ్వాస తీసుకోవ‌డంలో తీవ్ర‌మైన ఇబ్బంది ప‌డ్డాడ‌రు. ఈ క‌ణ‌తి కుడి ఊపిరితిత్తి, గుండెకి మ‌ధ్య‌లో అభివృద్ధి చెందింది. మ‌నిషికి శ్వాస ఆడాలంటే ఊపిరితిత్తులు ఎప్పుడూ సంకోచిస్తూ ఉండాలి. కణితి పెర‌గ‌డం వ‌ల్ల కుడి ఊపిరితిత్తి సంకోచించ లేదు. దీని వల్ల శ్వాస‌తీసుకోవ‌డంలో అత‌ను ఇబ్బంది గుర‌య్యాడు. దీనిని టెర‌టోమా వ్యాధిగా పిలుస్తారు. టెరాటోమా అనేది అరుదైన కణితి, ఇది జుట్టు, దంతాలు, కండరాలు మరియు ఎముకలతో సహా పూర్తిగా అభివృద్ధి చెందిన కణజాలం వివిధ అవయవాలను సోకుతుంది. టెరాటోమాలు టెయిల్‌బోన్, అండాశయాలు మరియు వృషణాలలో సర్వసాధారణం వ‌స్తాయి. కానీ శరీరంలో మరెక్కడైన‌ సంభవించవచ్చు. టెరాటోమాలు నవజాత శిశువులు, పిల్లలు లేదా పెద్దలలో కనిపిస్తాయి. అవి ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఈ రోగిలో రావ‌డం చాల అరుదైన‌దిగా గుర్తించాం.

ఛాతీ మ‌ధ్య‌లో గుండెకు స‌మీపంలో ఈ క‌ణితి అభివృద్ధి చెంద‌డం వ‌ల్ల శ‌రీరంలోని ప్ర‌ధాన ర‌క్త‌నాళం (ఆయోర్టా)కి కూడా వ్యాప్తి చెందింది. అంతేకాకుండా గుండెని ర‌క్షించే పెరికార్డియోకు కూడా వ్యాప్తి చెందింది. దీంతో అత‌నికి థొరాకోటమీ ఎన్ బ్లాక్ ఎక్సిషియ‌న్ ఆఫ్ మీడియా స్టిన‌ల్ టెరాటోమా ఓపెన్ స‌ర్జ‌రీ చేశాం. అంతేకాకుండా కృతిమంగా త‌యారు చేసిన పెరికార్డియో అమ‌ర్చి 25 సెంటీమీట‌ర్ల‌కు పైగా పెరిగిన క‌ణితిని విజ‌యంవంతంగా తొల‌గించాం. ఇప్పుడు రోగి పూర్తిగా కోలుకొని త‌న ప‌నుల‌ను తాను స్వ‌యంగా చేసుకోగ‌లుగుతున్నారు. చ‌క్క‌గా న‌డ‌వ‌గ‌లుగుతున్నారు.

శ‌రీరంలోని వివిధ భాగాలు ఎదుగుద‌ల లోపం వ‌ల్ల ఈ క‌ణితి పెరిగింది. రోగి ఆల‌స్యం చేస్తే అత‌ని ప్రాణాల‌కే హాని జ‌రిగేది. క‌ణితి ఊపిరితిత్తుల మ‌ధ్య‌లో పెర‌గ‌డం, గుండెకి వ్యాప్తి చెంద‌డం, అలాగే ప్ర‌ధానా ర‌క్త‌నాళానికి కూడా సోక‌డం వ‌ల్ల శ‌రీరంలోని ఇత‌ర భాగాలకు ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ తగ్గి అవ‌య‌వాలు ప‌ని చేయ‌కుండా పోయేవి. ఎక్కువ దూరం కూడా న‌డ‌వ‌లేని స్థితికి చేరుకునేవారు. దీంతో ప్రాణాల‌కు ముప్పు ఉండేది. ఈ స‌ర్జ‌రీ చేయ‌డం వ‌ల్ల ఊపిరితిత్తుల‌కు, గుండెకు క‌ణితి సోక‌కుండా కాపాడ‌గ‌లిగాం. “

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article