లారీ డ్రైవర్ అమానుషం.. చెత్త ఏరుకునే మహిళ దుర్మరణం

అమరావతి : గుంటూరు శివారు నాయుడుపేట జిందాల్ కంపెనీ సమీపంలో దారుణం జరిగింది. చెత్త కాగితాలు ఏరుకోవడానికి పిల్లలతో కలిసి చిలకలూరిపేట నుంచి ఒక మహిళ రమణ(40) వచ్చింది. చిలకలూరిపేట నుంచి గుంటూరుకు లారీలో వచ్చింది. గుంటూరు శివారు నాయుడుపేట వద్ద లారీ దిగి రూ.100 డ్రైవర్ కు ఇచ్చింది. అయితే రూ.300 ఇవ్వాలని మహిళను డ్రైవర్ డిమాండ్ చేసాడు. అంత డబ్బు లేదనడంతో.. పిల్లలను దించకుముందే డ్రైవర్ లారీ ముందుకు నడిపాడు. పిల్లల కోసం లారీని పట్టుకుని వేలాడుతూ కొంతదూరం వెళ్లిన మహిళఅదుపు తప్పి లారీ కింద పడి రమణ మృతి చెందింది. డ్రైవర్ లారీతో సహ పరారయ్యాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article