ధూళిపాళ్లను అడ్డుకున్న గ్రామస్థులు

చెబ్రోలు:గుంటూరు జిల్లా చేబ్రోలులో పొన్నూరు మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరి చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకు చుక్కెదురయింది. చేబ్రోలు మండలం శేకూరు వేణుగోపాల స్వామి దేవస్థానం ఎదురుగా ఉన్న చెరువులో జరుగుతున్న తవ్వకాలు పరిశీలించేందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళను గ్రామస్తులు ఆగ్రహంతో అడ్డుకున్నారు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మా గ్రామంలోని మట్టి అంతా రైల్వేకు ఇతర అవసరాలకు అమ్ముకున్నావని దుర్భాషలాడారు. ఈరోజు పంచాయతీ తీర్మానంతో గ్రామ ప్రజలకు జగనన్న ఇచ్చిన ఇళ్ల స్థలాలకు, రోడ్లకు చెరువు పూడిక తీసి మట్టి తోలుకుంటూ ఉంటే నీకెందుకు కడుపు మంట అని నిలదీసారు. గంటకు పైగా ధూళిపాళ్ళను కదలనీయకుండా నిర్బంధించారు. గ్రామస్తుల నుండి తప్పించుకోవటానికి ధూళిపాళ్ళ చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యయి.చివరకు పోలీసుల రంగప్రవేశంతో గ్రామం నుంచి సురక్షితంగా బయటపడ్డారు ధూళిపాళ్ళ.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article