వ‌చ్చే నెల‌లో థియేట‌ర్స్ బంద్‌

Theater Bund from Next Month

మంచి సినిమాల‌కు థియేట‌ర్స్ దొర‌క‌డం లేదు.. న‌లుగురి చేతిలోనే థియేట‌ర్స్ ఉన్నాయి… అనేలా చాలా సార్లు న్యూస్ విన‌ప‌డే ఉంటుంది. అయితే థియేట‌ర్స్ ప‌రిస్థితి వేరుగా ఉందట‌. థియేట‌ర్స్ లీజుకు తీసుకున్న వారికి వాటిని ర‌న్ చేయ‌డం ఇబ్బందిగా మారింద‌ట‌. అందుకు కార‌ణం స‌క్సెస్‌ఫుల్ సినిమాలు లేక‌పోవ‌డ‌మేన‌ట‌. హాలీడేస్ మిన‌హా మిగ‌తా రోజుల్లో థియేటర్స్‌కు ఆడియెన్స్ రావ‌డం లేదట‌. అదీగాక పార్కింగ్ ఫీజుల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం ర‌ద్దు చేయ‌డంతో ఆ ఆదాయం కూడా ప‌డిపోయింది. ఇలాంటి త‌రుణంలో త‌మ స‌మ‌స్య‌ల‌ను విన్న‌వించుకునేందుకు వీలుగా మార్చిలో థియేట‌ర్స్ బంద్ చేయాల‌నుకుంటున్నార‌నే వార్త‌లు విన‌పడుతున్నాయి. ముఖ్యంగా నైజాంలో థియేట‌ర్స్ యాజ‌మాన్యం పార్కింగ్ ఫీజు డిమాండ్ చేస్తూ స‌మ్మె చేయ‌బోతున్నార‌ని టాక్‌.

Check out here For More News

For More Interesting and offers

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article