థియేట‌ర్స్ అనుభ‌వం ప‌నికొచ్చింది – జియాశ‌ర్మ‌

Theater Experienced helped me – ZIA Sharma
`అర్జున్ రెడ్డి`లో చిన్న రోల్ చేసింది జియా శ‌ర్మ‌. తాజాగా ఆమె `ఎదురీత‌`లో న‌టిస్తోంది. శ్రావ‌ణ్ హీరోగా న‌టిస్తున్నారు. బాల‌మురుగ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా గురించి ముంబై భామ జియా శ‌ర్మ మాట్లాడింది.
* `ఎదురీత గురించి చెప్పండి?
– ఈ సినిమాలో భాగ‌స్వామ్య‌మైనందుకు ఆనందంగా ఉంది. ఇందులో అంత‌ర్లీనంగా మెసేజ్ కూడా ఉంది. అస‌లు మ‌నం భావిత‌రాల‌కు ఏం నేర్పుతున్నాం, ఏం వ‌దిలి వెళుతున్నామ‌న్న‌ది ఈ సినిమాలో కీల‌కం. `ఎదురీత‌` దాని గురించి మాట్లాడుతుంది.
* మీ పాత్ర ఎలా ఉంటుంది?
– నా పాత్ర పేరు వ‌ర్ష‌. కాలేజ్ గోయ‌ర్‌గా క‌నిపిస్తా. క‌థానుక్ర‌మంగా నా పాత్ర మారుతూ ఉంటుంది. ఈ సినిమాకు ప‌నిచేయ‌డం వ‌ల్ల చాలా నేర్చుకున్నా.
* ఇంత‌కు ముందు ఎక్క‌డైనా శిక్ష‌ణ తీసుకున్నారా?
– లేదండీ. కానీ థియేట‌ర్స్ లో నాకు మంచి అనుభ‌వం ఉంది. అది ఇప్పుడు ఇలా ఉప‌యోగ‌ప‌డింది. నేరుగా సెట్స్ లోకి వ‌చ్చేశాను. చుట్టూ ఉన్న అట్మాస్పియ‌ర్ వ‌ల్ల న‌టిగా చాలా మెరుగుప‌డుతాం అని అనిపించింది.
* తెలుగు రాక‌పోవ‌డం వ‌ల్ల ఇబ్బందేమీ అనిపించ‌లేదా?
– నేను చెప్పే డైలాగుల‌కు అర్థాలు అడిగి తెలుసుకున్నా. టీమ్ చాలా హెల్ప్ చేసింది.
For More Click Here
More Latest Interesting news
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article