వకీల్ సాబ్ చూస్తే కరోనా రాదా?

Telangana Movie Exhibitors and Distributors decided to close down all theatres, Except Vakeel Saab Running theatres. Dont Understand, Why they exempted Vakeel Saab Theatres? Because, the producer of this movie is Dil Raju, and he is having good relationship with the telangana government. But, Corona is not close to anyone. Must rethink on this decision.

81

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రత దృష్ట్యా సినిమా థియేటర్ల నిర్వహణపై ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు మంగళవారం సమావేశమయ్యారు. ఈసందర్భంగా రేపటి నుంచి థియేటర్లు మూసివేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. అయితే వకీల్‌సాబ్‌ సినిమా ప్రదర్శించే థియేటర్లకు మాత్రం మూసివేత నుంచి మినహాయించినట్లు ఎగ్జిబిటర్లు తెలిపారు. కరోనా ఉద్ధృతి, ప్రేక్షకుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈనిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మరి, కేవలం వకీల్ సాబ్ సినిమాకే ఈ మినహాయింపు ఎందుకిచ్చారో అర్థం కావడం లేదని ప్రేక్షకులు అనుకుంటున్నారు. వకీల్ సాబ్ సినిమా చూస్తే కరోనా రాదా? వకీల్ సాబ్ కరోనాకు ఏమైనా చుట్టమా అని ప్రశ్నిస్తున్నారు. వకీల్ సాబ్ సినిమా చూస్తే చాలు.. వారికి కరోనా వచ్చినా ఫర్వాలేదనే నిర్లక్షమా? అని ప్రేక్షకులు అడుగుతున్నారు. బంద్ చేస్తే అన్నీ థియేటర్లు బంద్ చేయాలి.. అంతేతప్ప, ఈ సినిమాకే ఎందుకు మినహాయించాలనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. మరి, ఈ విషయమై ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లే స్పష్టతను ఇవ్వాల్సిన అవసరముంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here