మంత్రి సబిత పై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యేతీగల

రంగారెడ్డి:మహేశ్వరం టీఆర్ఎస్ లో నేతల మధ్య మాటల యుద్ధం ముదిరాయి. ఇన్నాళ్లు నివురు కప్పిన నిప్పులా వున్నా విబేధాలు తాజాగా బయటపడుతున్నాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి పై టీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మండిపడుతున్నారు. ఈ నేపధ్యంలో అయన సంచలన వ్యాఖ్యలు చేసారు. మంత్రి సబితపై విరుచుకుపడ్డారు. తీగల మాట్లాడుతూ మీర్ పేట ను నాశనం చేస్తున్నారు. చూస్తూ నేను చూస్తూ ఊరుకోను.ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని హెచ్చరించారు.మంత్రి సబితా ఇంద్రారెడ్డి కబ్జాలను ప్రోత్సహిస్తున్నారు. ట్రంక్ లైన్ పనులు ఇంకా పూర్తి చెయ్యలేదు. చెరువులు, స్కూల్ జాగాలను వదలడం లేదు. మా పార్టీనుండి సబిత ఎమ్మెల్యే గా గెలువలేదు. సీఎంతో మాట్లాడుతానని తీగల అన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article