డీసీఎం ఢీకొని ముగ్గురి దుర్మరణం

యాదాద్రి భువనగిరి:యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం హన్మాపురం శివారులోని స్టాన్ ఫోర్డ్ కళాశాల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. డిసిఎం వాహనం స్కూటీ ఢీ కొట్టడం తో ముగ్గురు అక్కడి కక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. మృతుల్లో వలిగొండ మండలం టేకులసోమరం కి చెందిన దండెబోయిన నర్సింహ, ఆయన భార్య రాజ్యలక్ష్మి, నర్సింహ వదిన జంగమ్మ ఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను జిల్లా కేంద్ర ఆసుపత్రి మార్చురీకి అంబులెన్స్ లో తరలించారు. స్కూటీ భువనగిరి నుంచి జగదేవపూర్ వైపు వెళ్తుండగా, డిసిఎం వాహనం జగదేవ్ పూర్ వైపు నుంచి భువనగిరి వైపు వెళ్తుంది. డిసిఎం వాహన డ్రైవర్ మద్యం మత్తులో స్కూటీ ని ఎదురుగా బలంగా ఢీ కొట్టి డం తో డిసిఎం వాహనం స్కూటీ ని 50 మీటర్లు ఈడ్చు కుంటూవెళ్ళింది. అక్కడే ఉన్న స్థానికులు డిసిఎం వాహనాన్ని ఆపారు. మృతదేహాలు చెల్లాచెదురుగా రహదారి పై పడ్డాయి. మృతులు బొమ్మలరామారం మండలం చౌదరిపల్లి గ్రామంలో ఓ చావు కు హాజరుకావటానికి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article