ఎస్ఎంఆర్ హోల్డింగ్స్‌ స‌రికొత్త రికార్డు..

* నిర్మాణ ప‌నుల్ని ఆరంభించాక‌
* అధికారికంగా ప్రాజెక్టు ఆరంభం
* నిర్మాణ రంగంలో స‌రికొత్త ట్రెండుకు
* శ్రీకారం చుట్టిన ఎస్ఎంఆర్ హోల్డింగ్స్‌ 
ఎస్‌ఎంఆర్‌ హోల్డింగ్స్‌ మూడు నూతన టవర్లను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. వీటిలో హమిల్టన్‌ (80% పూర్తయింది); లోగన్‌ (60% పూర్తయింది) మరియు శివాలిక్‌ (30% పూర్తయింది) ఉన్నాయి. ఈ మూడూ ఎస్‌ఎంఆర్‌ వినయ్‌ ఐకానియా – అర్బన్‌ రిట్రీట్‌ వద్ద ఉన్నాయి. ఫ్యామిలీ ల కోసం అత్యంత ఆహ్లాదకరమైన గృహాలను ఇవి అందించనున్నాయి. వ్యూహాత్మకంగా ఈ ప్రాజెక్ట్‌ కొండాపూర్‌, గచ్చిబౌలి వద్ద ఉంది. ఈ ప్రాజెక్ట్‌ 22 ఎకరాలలో 11 టవర్లతో విస్తరించి ఉంది. అత్యంత ఆకర్షణీయమైన ల్యాండ్‌స్కేప్‌తో పాటుగా దేవాలయం, ప్రత్యేకమైనక్లబ్‌ హౌస్‌లు,క్రీడా వసతులు మొదలైనవి దీనిలో ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను విశాలవంతమైన ప్రాంగణం, సౌకర్యం, విలాసం మరియు అత్యంత అనుకూలమైన ప్రాంతాన్ని పూర్తి సమతుల్యతతో వినియోగదారులకు అందించేలా తీర్చిదిద్దారు. ఈ ప్రాజెక్ట్‌లో రెండు దశలు పూర్తి కావడంతో పాటుగా దాదాపుగా 1100 అపార్ట్‌మెంట్లను వినియోగదారులకు అందజేశారు. ఈ ప్రాజెక్ట్‌లో ఇప్పటికే 500కు పైగా కుటుంబాలు అత్యంత ఆహ్లాదకరమైన రీతిలో వసతులను ఆస్వాదిస్తున్నాయి. ఈ సెల్ఫ్‌ సస్టెయిన్డ్‌ టౌన్‌షిప్‌లో విశ్రాంత మరియు చురుకైన క్రీడా వసతులు ఉండటంతో పాటుగా సురక్షితమైన, సంతోషకరమైన కుటుంబ జీవనం కోసం వైద్య, షాపింగ్‌ జోన్లు కూడా ఉన్నాయి. బహుళ దశలలో అభివృద్ధి చేసే ఈ ప్రాజెక్ట్‌ ఎస్‌ఎంఆర్‌ వినయ్‌ ఐకానియా ఇప్పుడు రెడీ టు మూవ్‌ అపార్ట్‌మెంట్లు మొదలు పలు దశలలో నిర్మాణాలలో ఉన్న ప్రాజెక్ట్‌లను సైతం అందిస్తుంది.
నాణ్యమైన పనితనాన్ని ఎస్‌ఎంఆర్‌ వినయ్‌ ఐకానియా అందిస్తుంది. అత్యుత్తమ మెటీరియల్స్‌ వినియోగించుకోవడంతో పాటుగా అత్యాధునిక సాంకేతికత, సృజనాత్మక డిజైన్‌ మరియు ప్రాంగణాలను అత్యంత నైపుణ్యంగా వినియోగించడం ఈ ప్రాజెక్ట్‌ ప్రత్యేకత. తరువాత దశ వృద్ధికి ప్రతీకగా 2 మరియు 3 బీహెచ్‌కె లతో కూడిన హమిల్టన్‌ (జీ+30 అప్పర్‌ ఫ్లోర్స్‌), 2 మరియు 3 బీహెచ్‌కెలతో కూడిన లోగన్‌ (జీ+26 అప్పర్‌ ఫ్లోర్స్‌) , శివాలిక్‌ (జీ+31 అప్పర్‌ ఫ్లోర్స్‌) 2 , 3 మరియు 4 బీహెచ్‌కె టవర్ల అభివృద్ధి ఉంటుంది. ఇవన్నీ పూర్తిగా వాస్తు ప్రమాణాలతో నిర్మితమవుతున్నాయి. ఇవి మరో 1258 యూనిట్లను విలాసవంతమైన జీవనానికి చిరునామాగా నిలిచిన ఎస్‌ఎంఆర్‌ వినయ్‌ ఐకానియా కమ్యూనిటీకి జోడిస్తాయి. దీనిలో క్లబ్‌హౌస్‌, స్విమ్మింగ్‌ పూల్‌, అలా్ట్ర మోడ్రన్‌ జిమ్నాషియం, మినీ క్రికెట్‌ గ్రౌండ్‌, టెన్నీస్‌ కోర్ట్‌, స్క్వాష్‌ కో్‌ర్ట్‌ , ఇండోర్‌ బాడ్మింటన్‌ కోర్టు, బాస్కెట్‌బాల్‌ కోర్టు , అత్యున్నత శ్రేణి సింథటిక్‌ టర్ఫ్‌తో జాగింగ్‌ ట్రాక్‌, విస్తృతశ్రేణి పార్కింగ్‌స్పేస్‌ మరియు మరెన్నో వసతులు ఉన్నాయి.
ఈ సందర్భంగా ఎస్‌ఎంఆర్‌ హోల్డింగ్స్‌ ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్ ఎస్‌ రామ్‌ రెడ్డి మాట్లాడుతూ ‘‘భారతదేశ వ్యాప్తంగా నగరాలన్నీ కూడా హౌసింగ్‌, రెసిడెన్షియల్‌ ప్రోపర్టీ డిమాండ్‌ను చూస్తున్నాయి. మరీముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ప్రధాన నగరాలన్నింటిలోనూ ఈ డిమాండ్‌ అధికంగా కనిపిస్తుంది. భారతదేశంలో అత్యంత చురుకైన రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లలో రెండవదిగా హైదరాబాద్‌ మార్కెట్‌ నిలిచింది. హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ రంగం గణనీయమైన వృద్ధిని నమోదుచేసింది. రాబోయే సంవత్సరాలలో ప్రతిష్టాత్మకమైన వృద్ధి ఇక్కడ జరుగనుందని మేం అంచనా వేస్తున్నాం. ఎస్‌ఎంఆర్‌ వినయ్‌ ఐకానియాను ప్రకటించ‌డం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. దీనికి పక్కనే సుప్రసిద్ధ సంస్థ నిర్వహణలో బొటిక్‌ హాల్‌, హాస్పిటల్‌ కూడా రానున్నాయి. ఇవి 1.5 లక్షల చదరపు అడుగల విస్తీర్ణంలో రానుండటం చేత కమ్యూనిటీకి అత్యంత సౌకర్యవంతంగా నిలుస్తాయి’’అని అన్నారు.
ఎస్‌ఎంఆర్‌ హోల్డింగ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పృథ్వీ రెడ్డి మాట్లాడుతూ ‘‘ఎస్‌ఎంఆర్‌ హోల్డింగ్స్‌ వద్ద మేము వినియోగదారులను అత్యంత జాగ్రత్తగా చూస్తుంటాము. పిల్లలు కలిగిన మరియు పెద్దలతో కలిసి జీవించేటటువంటి వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అత్యంత అనుకూలమైన రీతిలో వసతులు అందించడంతో పాటుగా వ్యూహాత్మక ప్రాంతాలలో మా ప్రాజెక్ట్‌లను అత్యున్నత కనెక్టివిటీ , అసాధారణమైన ప్లానింగ్‌, ప్రాజెక్ట్‌ షెడ్యూలింగ్‌తో తీర్చిదిద్దుతున్నాం. సమయానికి ప్రాజెక్ట్‌ను వినియోగదారులకు పూర్తి సంతృప్తిని అందిస్తూ పూర్తి చేసేలా తగు పర్యవేక్షణ కూడా చేస్తుంటాం. మా దగ్గర సుశిక్షితులైన, చురుకైన ప్రొఫెషనల్స్‌ ఉన్నారు. వీరు వినియోగదారులు తమ అపార్ట్‌మెంట్‌ కొనుగోలు ప్రక్రియ మొదలు వారికి ఆ యూనిట్‌ను అందజేసే వరకూ మహోన్నతమైన సేవలను అందిస్తారు. ప్రభావవంతమైన ఎస్కలేషన్‌ మ్యాట్రిక్స్‌ కలిగి ఉండటం వల్ల వినియోగదారులకు సంబంధించి ఎలాంటి సందేహమైనా నిర్థిష్టమైన కాల వ్యవధిలో తీరకుండా ఉండదనే భరోసా అందిస్తారు. ఇది మా హ్యాపీ హోమ్‌ బయ్యర్‌ నెట్‌వర్క్‌ విస్తరించేందుకు సైతం తోడ్పడుతుంది. ఎస్‌ఎంఆర్‌ వినయ్‌ ఐకానియా వద్ద ముందుగానే హమిల్టన్‌ (80% పూర్తి అయింది), లోగన్‌ (60% పూర్తయింది), శివాలిక్‌ (30% పూర్తయింది) ప్రారంభించడం మా తరువాత దశ వృద్ధికి ప్రతీకగా నిలుస్తుంది. నేడు ఈ మూడు నూతన టవర్ల ప్రారంభాన్ని వెల్లడించాము కానీ ఇప్పటికే వీటి నిర్మాణ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. చెప్పిన సమయానికి ఈ ప్రాజెక్ట్‌లను గృహ కొనుగోలుదారులకు అందజేయనున్నాము. మరిన్ని కుటుంబాలు ఈ ప్రాజెక్ట్‌ వద్ద అందించే ఐనానిక్‌ జీవనశైలి ఎంచుకోవడంతో పాటుగా ఎస్‌ఎంఆర్‌ ఫ్యామిలీలో భాగమవుతారని ఆశిస్తున్నామ‌’’న్నారు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article