పెద్దపల్లిలో పెద్దపులి

33
Tiger, In peddapally District

Tiger in village

పెద్దపల్లి జిల్లాలో ఓ పెద్దపులి కలకలం రేపింది. జిల్లాలోని ముత్తారం మండలం దర్యాపూర్‌ గ్రామ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచార అనవాళ్లు కనిపించాయి. పెద్దపులి అడుగులను గ్రామస్తులు గుర్తించారు. దీంతో భయాందోళనకు గురైన గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు అడుగులను పరిశీలించి పెద్దపులి అడుగులుగా నిర్ధారించారు. బగుల గుట్ట అడవులకు వచ్చి దర్యాపూర్‌లో తిరుగుతున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా భయటకు వెళ్లొద్దని అటవీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మేత కోసం ఆవులను, గొర్రెలను, మేకలను అడవికి తీసుకువెళ్లవద్దని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here