- ఉప ముఖ్యమంత్రి భట్టికి వినతిపత్రం అందించిన
- టిఎన్జీఓ ఉద్యోగ సంఘాల నాయకులు
ఉద్యోగులు, పెన్షనర్ల పెండింగ్ బిల్లులను చెల్లించాలని, డిఎలను విడుదల చేయాలని, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కను కలిసి టిఎన్జీఓ నాయకులు శనివారం వినతి పత్రాన్ని సమర్పించారు. టిఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కె. లక్ష్మణ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ హుస్సేనీ, నగరశాఖ ఉపాధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, హైదరాబాద్ ఉపాధ్యక్షుడు శంకర్ తదితరులు ఉప ముఖ్యమంత్రిని కలిశారు. త్వరలోనే ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని, ముఖ్యమంత్రితో చర్చిస్తానని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క టిఎన్జీఓ సంఘం నాయకులకు హామీ ఇచ్చినందుకు టిఎన్జీఓ పక్షాన వారు కృతజ్ఞతలు తెలియజేశారు.