To Day Top Headlines In Telugu
1. కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది.
2. సీఆర్డీఏ పరిధిలో థర్డ్ పార్టీ భూముల కొనుగోళ్లను రద్దు చేస్తూ ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది.
3. 2002 నాటి గోద్రా అల్లర్ల కేసులో నరేంద్ర మోదీకి నానావతి కమిషన్ క్లీన్ చిట్ ఇచ్చింది.
4. మహిళల భద్రత కోసం రూపొందించిన చరిత్రాత్మక ముసాయిదా బిల్లుకు జగన్ సర్కారు ఆమోదం తెలిపింది.
5. దిశ హత్య కేసులో నిందితుల ఎన్కౌంటర్ వ్యవహారంపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది.
6. కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటు ఆవరణలో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనకు దిగారు
7. అమెరికాలో మరోసారి గన్ కల్చర్ పడగవిప్పింది. న్యూజెర్సీలో జరిగిన కాల్పుల్లో ఓ పోలీస్ అధికారి సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు