సంక్రాంతి ఎఫెక్ట్.. టోల్ గేట్ల వద్ద  ట్రాఫిక్ టెర్రర్

100
FAST TAG ON TOll BOOTS
FAST TAG ON TOll BOOTS

toll plazas witness heavy traffic ahead of Sankranthi 2020

సంక్రాంతి పండుగకు తెలంగాణలో ఉన్న ఏపీ వాసులంతా ప్రయాణాలు మొదలు పెట్టారు. . తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సంతోషంగా జరుపుకునే ఈ పండుగ కోసం తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు నగరవాసులు సిద్ధమయ్యారు. ఇక రేపటి నుంచి విద్యా సంస్థలకు కూడా సెలవులు ఉండటంతో.. విద్యార్థులు ఇంటిబాట పట్టారు. దీంతో నగరంలోని రైల్వేస్టేషన్ బస్టాప్‌లు ప్రయాణీకులతో బిజీగా ఉన్నాయి. మరోవైపు హైదరాబాద్‌, విజయవాడ 65 నెంబర్‌ జాతీయ రహదారిపై ఉన్న టోల్‌ ప్లాజాల వద్ద వాహనాల రద్ధీ పెరిగింది. టోల్‌ గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్ ఏర్పడుతోంది . ఇక పంతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ కొనసాగుతుంది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతుంది. తాజాగా వెంకటాచలం టోల్‌ గేట్‌ వద్ద భారీ ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. చెన్నై నుంచి తెలంగాణ, హైదరాబాద్‌ విజయవాడ వైపు వెళ్లే వారికి టోల్‌గేట్‌లో 8 టోల్‌ బూత్‌లను తెరిచారు. అయితే బూత్‌లో ఫాస్టాగ్ స్కానర్‌ సరిగా పనిచేయకపోవడంతో పాత రేట్ల ప్రకారం డబ్బులు తీసుకొని వాహనాలను పంపుతున్నారు. మరోవైపు రహదారిపై ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు యాక్సిడెంట్‌ బ్లాక్‌ స్పాట్‌లను గుర్తించి బారికేడ్‌లు ఏర్పాటు చేశారు.

toll plazas witness heavy traffic ahead of Sankranthi 2020,andhra pradesh, hyderabad, Sankranthi festival  ,Heavy traffic jam,Panthangi Toll Plaza,Vijayawada, National highway ,passengers,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here